ఆమ్లేట్ పాన్‌కి అంటుకోకుండా రావాలంటే..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (17:53 IST)
తేనె నిల్వ ఉండేందుకు... శుభ్రమైన సీసాలో పోసి రెండు లవంగాలను అందులో వేసి ఉంచాలి. బెల్లాన్ని నీటిలో కరిగించి.. ఆపై వడగట్టి పాకం పడితే ఇసుక రాకుండా ఉంటుంది. చపాతీలు తెల్లగా, మెత్తగా ఉండాలంటే.. పిండిలో నూనె, పాలు, బియ్యం పిండి వేసి ఐస్ నీళ్లతో కలపాలి. 
 
ఆమ్లేట్ పాన్‌కి అంటుకోకుండా రావాలంటే.. ఆమ్లేట్ వేసే ముందు పాన్‌పై కొద్దిగా ఉప్పు చల్లి చూడండి. మరలు బిగుసుకుపోయిన జాడీ మూతలను తేలికగా తీయాలంటే.. కొద్దిగా నూనెలో ఉప్పు కలిపి జాడీ మూతలకు పట్టించి కాసేపటి తరువాత తీస్తే తేలికగా తిరుగుతూ వచ్చేస్తాయి. ఇంట్లో ఫ్రిజ్ లేనప్పుడు పచ్చిమిరపకాయలను తడిలేకుండా తుడిచేసి ఓ స్పూన్ పసుపుపొడిని వాటికి పట్టించి గాజు డబ్బాలో వేసి గట్టిగా మూత బిగించి ఉంచితే వారం రోజులపాటు చెడిపోకుండా ఉంటాయి. 
 
నిమ్మరసం ఎక్కువగా రావాలంటే నిమ్మకాయలను 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంటే రసం తీయడానికి 10 ముందు వాటిని బయటపెట్టాలి. వంట పాత్రలకు అంటుకున్న జిడ్డు పోవాలంటే నిమ్మచెక్కతో పాత్రలను బాగా రుద్దిన తరువాత నీటితో కడిగి, మెత్తటి వస్త్రంతో పాత్రలను తుడవాలి. పకోడీలను కలిపిన పిండిని పావుగంట పాటు ఊరనిచ్చి ఆ తరువాత కొన్ని వెల్లుల్లిపాయలను నూరి కలిపితే పకోడీలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓటు వేసి గెలిపిస్తే థాయ్‌లాండ్ ట్రిప్ - పూణె ఎన్నికల్లో అభ్యర్థుల హామీలు

దేశం మెచ్చిన నాయకుడు వాజ్‌పేయి : సీఎం చంద్రబాబు

నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి...

క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోడీ... యేసు బోధనలు శాశ్వత శాంతిని నెలకొల్పుతాయి..

మందుబాబులకు సీపీ సజ్జనార్ వార్నింగ్.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలుకే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు

'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?

నేను ఫిట్‌గా గ్లామరస్‌గా ఉన్నాను : నటి అనసూయ

మహిళల దుస్తులు, ప్రవర్తనపై వేలెత్తి చూపడం నేరాలను ప్రోత్సహించినట్టే : చిన్మయి

'శంబాల' గ్రామంలో మిస్టీరియస్ మరణాల మర్మమేంటి? (మూవీ రివ్యూ)

తర్వాతి కథనం
Show comments