క్యాలీఫ్లవర్‌ను ఉడికించే నీళ్ళలో పాలను చేర్చితే?

క్యాలీఫ్లవర్‌ను ఉడికించే నీళ్ళలో కాసిని పాలు చేర్చితే రంగు మారకుండా ఉంటుంది. అరటి చిప్స్‌ని వేయించేటప్పుడు ఉప్పు నీళ్ళు చిలకరించి వేయిస్తే కరకరలాడతాయి. లడ్డూలని అర నిమిషం మైక్రో ఓవెన్ లో ఉంచి తీస్తే త

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (13:48 IST)
క్యాలీఫ్లవర్‌ను ఉడికించే నీళ్ళలో కాసిని పాలు చేర్చితే రంగు మారకుండా ఉంటుంది. అరటి చిప్స్‌ని వేయించేటప్పుడు ఉప్పు నీళ్ళు చిలకరించి వేయిస్తే కరకరలాడతాయి. లడ్డూలని అర నిమిషం మైక్రో ఓవెన్ లో ఉంచి తీస్తే తాజాగా వుంటాయి. బియ్యాన్ని నిల్వ ఉంచేటప్పుడు ఎండిన పుదీనా ఆకులని మెత్తని పొడిగా చేసి కలిపితే పురుగు పట్టకుండా చక్కని సువాసనతో ఉంటాయి.
 
ఓవెన్‌ను శుభ్రపరిచేప్పుడు లోపల వంటసోడా చల్లి రాత్రంతా మూత పెట్టి ఉంచాలి. ఉదయమే ఉప్పు, నిమ్మరసం సమానంగా కలిపి దానిలో ముంచిన స్పాంజితో తుడిస్తే దుర్వాసన పోతుంది. పచ్చి బఠాణీలు నిల్వ ఉండాలంటే వాటిని పాలిథీన్ సంచిలో వేసి డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. పాలు కాచే పాత్రకి అడుగున కొద్దిగా నెయ్యి రాస్తే దానిని శుభ్రపరచడం తేలిక అవుతుంది. 
 
మిఠాయిల తయారీకి పంచదార పొడి చేస్తుంటే, నాలుగు బియ్యం గింజల్ని కూడా కలపండి. పొడి ఉండకట్టకుండా ఉంటుంది. కొన్ని రకాల కేక్‌లు, బిస్కట్ల తయారీలో వాడే హేజల్ నట్స్ దొరకనప్పుడు కప్పు బాదం పలుకులు వేసుకోవచ్చు. రుచిలో తేడా వుండదు. 
 
కూరగాయలు ఉడికించాక రంగు కోల్పోకుండా ఉండాలంటే నీళ్ళలో చిటికెడు పసుపు, చెంచా ఆలివ్ నూనె జోడిస్తే సరిపోతుంది. బియ్యాన్ని మిక్సీ పట్టేటప్పుడు అందులో చెంచా పంచదార కలిపితే బియ్యం పిండి తెల్లగా వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు

లైంగిక దాడికి ఒప్పుకోలేదని టెక్కీని చంపేశాడు.. నిప్పంటించి హత్య చేశాడు..

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం శుభాకాంక్షలు

ఇస్రోకు ఎదురుదెబ్బ.. పీఎస్ఎల్‌వీ C62/EOS-N1 ప్రయోగం విఫలం

మాలధారణలో వుంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అబ్బ.. మన శంకరవర ప్రసాద్ ఫుల్ మీల్స్ వినోదం, ఆడియెన్స్ పల్స్ పట్టుకున్న రావిపూడి

Karate Kalyani: హరికథా కళాకారులకు అండగా కరాటే కళ్యాణి

Meenakshi Chaudhary: సినీ ప్రయాణం ముగింపు లేని పరుగు పందెం లాంటిది : మీనాక్షి చౌదరి

Ravi Teja: సునీల్ తో దుబాయ్ శీను లాంటి ఫన్ చూడబోతున్నారు : రవితేజ

Jayakrishna: తాతయ్య కృష్ణ గారు గర్వపడేలా చేయడమే నా జీవితాశయం: జయకృష్ణ

తర్వాతి కథనం
Show comments