Webdunia - Bharat's app for daily news and videos

Install App

చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను?

Webdunia
గురువారం, 13 నవంబరు 2014 (17:29 IST)
* కూరల్లోగాని, పప్పులోగాని ఉప్పు ఎక్కువయినపుడు కాస్త నిమ్మరసం పిండాలి. 
 
* గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి మెత్తగా ఉంటుంది. ఆ పిండితో చేసిన రొట్టెలు ఎంతో మృదువుగా ఉంటాయి. 
 
* గారెల పిండిలో, పులిసిన పెరుగు ఒక కప్పు, లేదా రెండు చెంచాల మైదా వేశారంటే గారెలు మృదువుగా, టేస్టీగా ఉంటాయి. 
 
*  గులాబ్ జాం తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీరు కలపండి. అవి మృదువుగా రుచిగా ఉంటాయి. 
 
* గులాబ్ జాంలు చేసే సమయంలో కాసిన్ని జీడిపప్పు పొడిని ఉండలకు కలిపారంటే, అవి మృదువుగా ఉంటాయి. మంచి రుచిగా ఉంటాయి. 
 
*  చింతపండు పచ్చడికి కాస్త బెల్లం, కాసిని టమోటాలు కలిపారంటే, చింతపండు చట్నీ రుచే వేరుగా ఉంటుంది. 
 
* చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి. 
 
* చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు మృదువుగా ఎక్కువసేపు ఉంటాయి.
 
* చపాతీలు వత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనెవేసి మడతలతో చేసి హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడుగంటలపాటు మెత్తగా ఉంటాయి. 
 
* టమోటా చారు పొయ్యిమీద నుంచి దింపేటప్పుడు కాస్త నిమ్మరసం పిండండి. అది మాంచి రుచిగా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

Show comments