ఇడ్లీ పిండిలో చెంచా నువ్వుల నూనె వేస్తే?

Webdunia
మంగళవారం, 4 నవంబరు 2014 (18:58 IST)
కంది పప్పు త్వరగా ఉడకాలంటే, ఉడుకుతున్నప్పుడు నాలుగైదు బియ్యపు గింజలు వేయాలి. అలాగే కంది పప్పు ఉడుకుతున్నప్పుడు ఎక్కువ పొంగు వస్తున్నట్లయితే రెండు నూనె బొట్లు వేస్తే పొంగు తగ్గుతుంది.
 
అన్నం, పప్పు వండేటప్పుడు సరిగ్గా అవసరమైనంతవరకే నీటిని పోయండి. అర్జెంటుగా మీకు మజ్జిగ కావలసి వచ్చిందనుకోండి-దానికేం చేస్తారంటే-పాలు గోరు వెచ్చగా వెచ్చబెట్టి అందులో చిటికెడు ఉప్పు వేయండి. కొద్దిగా నిమ్మ పండు రసం కూడా పిండండి. కొద్ది సేపట్లోనే పాలు విరిగి మజ్జిగ అవుతుంది. 
 
అల్యూమినియం లేదా ఇనుప పెనం మీద దోసెలు వేస్తున్నప్పుడు అవి సరిగ్గా రాకుండా అంటుకుపోతుంటే పెనం సరిగ్గా వేడెక్కలేదేమో గమనించండి. సరిగ్గా వేడెక్కకపోతే దోసెలు దానికి అంటుకుపోతాయి. 
 
ఆలూ చిప్స్ ఇంట్లో చేసేటప్పుడు నల్లబడి పోకుండా ఉండాలంటే పలచని మస్లిన్ వస్త్రంలో కాస్త సిట్రిక్ యాసిడ్ వేసి దాని ముక్కల్ని ఉడికించే నీటిలో ముంచి తీయాలి. ఇడ్లీ పిండి పల్చగా ఉంటే కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి. ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ, గుప్పెడు అన్నం కానీ వేశారంటే ఇడ్లీలు చాల మృదువుగా ఉంటాయి. 
 
ఇడ్లీ పిండిని టైటుగా మూత పెట్టిన ప్రెజర్ కుక్కర్లో ఉంచారంటే త్వరగా పులుస్తుంది. ఇడ్లీ చప్పగా కాకుండ రుచిగా ఉంటాయి. ఇడ్లీ పిండిలో చెంచా నువ్వుల నూనె వేస్తే ఇడ్లీలు తెల్లగా మృదువుగా వస్తాయి. ఉడికించే నీటిలో కొద్దిగా వంటనూనె వేస్తే బంగాళదుంపలు త్వరగా ఉడుకుతాయి. ఉల్లి పాయను అడ్డంగా కోసి దోసెల (అట్లు) పెనం మీద రాస్తే దోసెలు చక్కగా చెడకుండా వస్తాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ చంపేసిందా?

వరుడికి ఎయిడ్స్ వుందని తెలిసి పెళ్లికి నో చెప్పిన యువతి.. కానీ ఇంటికెళ్లి బలవంతంగా ఇంజెక్షన్?

భర్తను స్నేహితుడి సాయంతో చంపేసిన భార్య.. నిద్రలో వుండగానే?

పటాన్‌చెరు గుడిసెలో దంపతుల హత్య.. ఏం జరిగింది?

పాడేరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పలు కార్యక్రమాలకు శ్రీకారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: కొరియన్ ఫుడ్ తింటూ షూటింగ్ కు సిద్ధమవుతున్న కొరియన్ కనకరాజ్

Vishal: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపిన నటుడు విశాల్

Mehar Ramesh: సభ్యులకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాం, దాసరి విగ్రహానికి స్టేజీ ఏర్పాటు:: మెహర్ రమేష్

Sangeeth Shobhan :: ప‌దే ప‌దే ప్రాణం నిన్నే కోర‌గా.. అంటూ ప్రేమగీతంలో అలరించిన సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌

Trisha: టీవీకే పార్టీలో చేరనున్న నటి త్రిష?

Show comments