చపాతీ పిండికి.. అరటిపండ్ల గుజ్జు కలిపితే?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (13:16 IST)
చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో రెండు  పండ్ల అరటి గుజ్జును కలిపితే.. చపాతీలు మెత్తగా ఉండటమే గాక చాలాసేపు గట్టిపడకుండా ఉంటాయి. చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో గుప్పెడు శెనగపిండి కలిపితే చపాతీ మంచి రంగు, వాసన వస్తుంది. చపాతీ పిండిలో వంద గ్రాముల తాజా వెన్న కలిపితే చపాతీలు మెత్తగా రావటమే గాక రుచి అద్భుతంగా ఉంటుంది. 
 
పప్పు వండేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసి వండి, ఆ వేడి పప్పు నీటిని గోధుమ పిండికి కలిపి చపాతీ చేస్తే మెత్తగా రావటమే గాక పప్పులోని పోషకాలూ అందుతాయి. చపాతీలు మెత్తగా ఉండి, పూరీల్లా బాగా పొంగాలంటే గోధుమ పిండిలో కొంచెం పెరుగు లేదా మజ్జిగ కలిపితే చాలు.
 
చపాతీలు చేసేటప్పుడు పొడి పిండి ఎక్కువగా వాడకపోవడం, చేయగానే హాట్ బాక్స్‌లో వేసుకుంటూ పోవటం వల్ల అవి వేడిగా, మెత్తగా ఉంటాయి. చపాతీ పిండి కలుపుకుని బాగా మర్దన చేసి తడి బట్టలో చుట్టి పెట్టి అరగంట తర్వాత చపాతీలు చేస్తే అవి పొంగి, మెత్తగా వస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ - స్కూల్‌కు కంప్యూటర్ల వితరణ

డిసెంబర్ 16-22వరకు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లో రాష్ట్రపతి పర్యటన

YSRCP: కోటి సంతకాల సేకరణ.. ప్రైవేట్ చేతికి వైద్య కళాశాలలను అప్పగిస్తారా? రోజా ఫైర్

నరసాపురం - చెన్నై వందే భారత్ రైలు ప్రారంభం ... 17 నుంచి పూర్తి సేవలు

ఆలస్యంగా నడుస్తున్న ఇండిగో విమానాలు: పరుపుతో సహా విమానాశ్రయానికి ప్రయాణికుడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

తర్వాతి కథనం
Show comments