ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడని ఆ ఐదు కూరగాయలు ఏంటి?

Webdunia
గురువారం, 26 మే 2016 (15:50 IST)
సాధారణంగా కాయగూరలు, పండ్లను ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచుతారు. ఇలా భద్ర పరిచి ఎక్కువ రోజులు వాడుకుంటుంటారు. అయితే, కూరగాయల్లో ఐదింటిని మాత్రం ఫ్రిజ్‌లో నిల్వ ఉంచరాదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం వల్ల వాటి సహజ గుణం, రుచిని కోల్పోతాయని చెపుతున్నారు. అలాంటి వాటిలో ఉల్లిపాయలు, బంగాళాదుంలు, టొమాటోలు, అరటిపండ్లు, ఆలివ్ నూనెలు ఉన్నాయి. 
 
ఉల్లిపాయలు 
ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో భద్రపరచడం వల్ల మృదువుగా మారిపోతాయి. పైగా, నెమ్ము తగలడం వల్ల బూజుపట్టే అవకాశం ఉంది. అందువల్ల వీటిని చల్లని, పొడి వాతావరణంలో నిల్వ చేయాలని. అలాగే, కూరగాయల నుంచి వేరు చేయాలి. లేనిపక్షంలో ఉల్లిపాయల వాసన కూరగాయలకు చేరుతుంది. దీనివల్ల కూరలు ఉల్లిపాయల వాసన వచ్చే అవకాశం ఉంది. 
 
అరటిపండ్లు
అరటిపండ్లు సహజమైన ఓ రుచి ఉంటుంది. వీటిని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచడం వల్ల ఆ రుచి పోవడమే కాకుండా, అందులోని పొటాషియంను పూర్తిగా కోల్పోతుంది. అందువల్ల అరటిపండ్లను ఎల్లవేళలా గది ఉష్ణోగ్రతలోనే నిల్వ ఉంచాలి. 
 
బంగాళాదుంపలుం
బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి ఫ్లేవర్‌ను కోల్పోతాయి. పైగా.. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల ఈ దంపుల్లోని స్టార్చ్ (పిండిపదార్థం) చక్కెరగా మారిపోయే అవకాశం ఉంది. అందువల్ల పేపర్ బ్యాగుల్ ప్యాక్ చేసి గది టెంపరేచర్‌లోనే నిల్వ ఉంచాలి.
 
టొమాటోలు  
టొమాటోలు ఒక్కసారి ఫ్రిజ్‌లో ఉంచిన పూర్తిగా రుచిని కోల్పోతాయి. అందువల్ల వీటిని ఉష్ణోగ్రతలోనే నిల్వచేయాలి. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. 
 
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్‌ను శీతలీకరణ యత్రంలో నిల్వ చేయడం వల్ల దాన్ని స్థిరత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆలివ్ నూనె ఒక చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో కాంతి, వేడి, గాలిలేని ప్రదేశంలో నిల్వ చేయడం వల్ల హానికారక క్రిములు తయారై ఆరోగ్యానికి హానికలిగించే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కొలంబో వెళ్లాలా? టీవీలో చూడొచ్చుగా: లోకేష్ పైన జగన్ విసుర్లు

పశు వికాస్ డే ద్వారా సర్వోత్తం సేవలో ముందంజలో ఉన్న SMFG ఇండియా క్రెడిట్

క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు .. ఎందుకో తెలుసా?

వైకాపా హయాంలో ఎక్సైజ్, మైనింగ్ ఆదాయ తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది : మంత్రి పయ్యావుల

మేనల్లుడి మెహందీ వేడుకలో నృత్యం చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన మేనమామ, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arjun: నాలుగు రోజుల్లో 8.7 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన సీతా పయనం

Hebba Patel: మిరాకిల్ చేద్దాం రండి అంటున్న హెబ్బా పటేల్

హే బల్‌వంత్ మెమరబుల్ ఫిల్మ్ అవుతుంది ఫ సీనియర్ నరేష్

DSP: ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో - పవన్ కు గిఫ్ట్ ఇది : దేవీశ్రీ ప్రసాద్

DiL Raju: నిర్మాత అంటే విలువలేదు - కానీ సినిమా తీస్తా : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments