Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ వంటకాల్లో పోషకాలు పదిలంగా ఉన్నాయా!?

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2011 (15:07 IST)
FILE
వంటకాల్ని రుచిగా మాత్రమే కాదు.. పోషకాలు తగ్గిపోకుండా వండటం.. కూడా తెలిసుండాలి. అందుకు ఏం చేయాలంటే.. ఆకుకూరలు ఉడికించే నీళ్లలో కొద్దిగా ఆలివ్‌నూనె లేదా నిమ్మరసం వేస్తే పోషక విలువలు పోకుండా తగ్గకుండా ఉంటాయి. అంతేకాదు ఆకులు కూడా రంగును కోల్పోకుండా ఉంటాయి.

కూరలు, పులుసులు, గ్రేవీలు వంటివి చేసేటప్పుడు సన్నటి మంటపై ఉంచి వండాలి. అలాగే పాత్ర మూత తప్పనిసరిగా పెట్టాలి. దానివల్ల విలువైన మాంసకృత్తులు ఆవిరి రూపంలో వృధా కాకుండా ఉంటాయి.

ఏ పదార్థాలనైనా ఎక్కువ మంట మీద వండకూడదు. అతిగా వేయించడం, ఉడికించడం వల్ల పదార్థాల్లోని ఖనిజలవణాలను కోల్పోవాల్సి వస్తుంది. పులుసు, గ్రేవీల్లో వేసే కూరముక్కలను చిన్నగా కోసి వేస్తే త్వరగా ఉడుకుతాయి. పోషకవిలువలు కూడా అలాగే పదిలంగా ఉంటాయి.

చాలామంది ఉల్లిపాయలను తరిగిన వెంటనే కూరల్లో వేస్తుంటారు. అయితే ఇందులో కొన్నిరకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాటిని పొందాలంటే.. ఉల్లిపాయల్ని కోసిన పదినిమిషాల తరువాత వాడితే మేలు.

నాణ్యత తక్కువగా ఉన్న పాత్రలు అంటే పెనం, బాణలి వంటివి వాడితే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అందుకే వంటింటి సామగ్రి విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీలుకొని ఎంచుకోవాలి. అలాగే నాన్‌స్టిక్ పాత్రలు కొంటున్నప్పుడు కూడా వాటి నాణ్యతను ఒకటికి రెండుసార్లు పరీక్షించి ఆ తరువాతే వాడాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments