Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్కాలు: పాత టాల్కం పౌడర్ సువాసన తగ్గిపోయిందా..?

Webdunia
FILE
పాత టాల్కం పౌడర్‌కు సువాసన తగ్గితే ఆ డబ్బాని కాసేపు ఎండలో ఉంచితే సువాసన తిరిగి పొందవచ్చు. ఇలా పాత వస్తువుల్ని ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవాలంటే ఇవిగోండి కొన్ని చిట్కాలు..

* పాత గ్రీటింగ్ కార్డుల్లో ఖాళీగా ఉన్న భాగాన్ని పిల్లలకు బొమ్మలు వేసుకునేందుకు ఇవ్వవచ్చు.

* పాత చెప్పులను కానీ, కొత్తవి కానీ, ఎప్పుడూ బట్టతో తుడవకూడదు. తుడవడం వలన షైనింగ్, పైన పొట్టు పోతుంది. స్పాంజీ ముక్కతోనే తుడవాలి. మంచి షైనింగ్ వస్తుంది. పైన పొట్టులా లేచిపోదు.

* పాత టర్కిష్ టవల్స్ వంటింట్లో చేయి తుడుచు కోవటానికి, చిన్న హ్యాండ్ టవల్స్‌గా కట్‌చేసి ఉపయోగించవచ్చు. చేనేత టవల్స్ అయితే గాజు సాసర్ల సైజులో రౌండ్‌గా కత్తిరించి సాసర్ల మధ్య వుంచితే గీతలు, దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంటాయి.

* పాత పేపర్లలో మిగిలిన పెద్దపెద్ద ముక్కలను షెల్ఫ్‌లలో పరిస్తే ఆకర్షణీయంగా ఉంటాయి.
పాత బనియన్లు పారేయకుండా కడిగిన గాజు వస్తువులు తుడవడానికి ఉపయోగించవచ్చు. ఇవి తేమను బాగా పీల్చుకుంటాయి.

* పనిచేసే కాలం దాటిపోయిన టానిక్‌లను మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. పెన్సిల్ బ్యాటరీలు అయిపోవచ్చినట్లు అనిపిస్తే వాటి నెగిటివ్‌వైపు కొవ్వొత్తి మంటమీద అయిదు నిముషాలు ఉంచితే మరికొన్ని రోజులు పనిచేస్తాయి.

* ప్లవర్ వాజ్ లో సాల్ట్ కల్పిన నీరు పోస్తే ప్లవర్స్ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి. ప్లాస్టిక్ కంటైనర్‌కి పసుపు మరకలు అయితే సున్నిపిండి లేదా శనగ పిండితో రుద్దితే అవి మాయమవుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

Show comments