Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టీమ్‌డ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో తెలుసా?

Webdunia
బుధవారం, 23 జులై 2014 (18:17 IST)
ఎగ్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చూస్తుంది. ఒక కోడిగుడ్డులో ఆరు గ్రాముల హై-ప్రోటీన్స్ ఉంటాయని న్యూట్రీషన్లు అంటున్నారు. కోడిగుడ్డులో విటమిన్ బి2 ఉంటుంది. కోడిగుడ్డును ఆమ్లెట్, కూరల్లా గాకుండా వెరైటీగా స్టీమ్డ్ కర్రీ టేస్ట్ చేయండి. 
 
కావలసిన పదార్థాలు :
కోడిగ్రుడ్లు... నాలుగు
ఉల్లిపాయలు... 50 గ్రాములు
మిరియాలపొడి... పావు టీస్పూన్
పచ్చిమిర్చి... రెండు
ఉప్పు... తగినంత
పసుపు... చిటికెడు
 
గ్రేవీ తయారీకి....
ఉల్లిపాయలు... పావు కేజీ
టొమోటోలు... పావు కేజీ
పచ్చిమిర్చి... నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్... ఒక టీస్పూన్
నూనె... నాలుగు టీస్పూన్లు
ధనియాలపొడి... రెండు టీస్పూన్లు
కారం... ఒక టీస్పూన్
పసుపు... అర టీస్పూన్
గరంమసాలా... చిటికెడు
ఉప్పు... సరిపడా
 
తయారీ విధానం :
ముందుగా కోడిగ్రుడ్లను పగులగొట్టి ఓ గిన్నెలో సొన వేసుకోవాలి. అందులోనే తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, మిరియాలపొడి అన్నీ వేసి గిలగొట్టాలి. మరో గిన్నెలో అడుగున నూనె పూసి ఈ గిలకొట్టిన కోడిగుడ్ల సొన మిశ్రమాన్ని వేసి మూతపెట్టి కుక్కర్‌లోగానీ, ఆవిరిపాత్రలోగానీ పది నిమిషాలపాటు ఉడికించాలి.
 
ఉడికించి తీసిన తరువాత గుడ్డు జున్నుముక్కలాగా గట్టిపడుతుంది. వీటిని ముక్కలుగా కోసి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ తయారీ ఎలాగో చూద్దాం...!
 
బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాలపొడి, పసుపు కూడా వేసి వేయించాలి. తరువాత చిన్న ముక్కలుగా తరిగిన టమోటోలను, పచ్చిమిర్చిని కూడా చేర్చి మూతపెట్టి ఉడికించాలి. గ్రేవీ గట్టిపడిన తరువాత ఉప్పు సరిచూసుకుని, గరంమసాలా వేసి దించే ముందు పైన ఉడికించి పెట్టుకున్న గ్రుడ్లముక్కలను వేయాలి. అంతే స్టీమ్‌డ్ ఎగ్ కర్రీ రెడీ... ఇది వేడి వేడి అన్నం, చపాతీ, పూరీలలోకి అద్భుతంగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు

నేటి నుంచి ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌లో మార్పులు.. క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు...

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

Show comments