క్యాల్షియం, ఫైబర్‌ కాంబోలో బరువును తగ్గించే పనీర్ చపాతీ ఎలా చేయాలి..?!

పాల ఉత్పత్తుల్లో ఒకటైన పనీర్‌లో క్యాల్షియం పుష్కలంగా ఉంది. ఇందులోని ప్రోటీనులు, క్యాల్షియం దంతాలకు, ఎముకలకు బలాన్నిస్తాయి. లినోలియిక్ ఆసిడ్ బరువును నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇక గోధుమలతో చేసే చపాతీ

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (12:58 IST)
పాల ఉత్పత్తుల్లో ఒకటైన పనీర్‌లో క్యాల్షియం పుష్కలంగా ఉంది. ఇందులోని ప్రోటీనులు, క్యాల్షియం దంతాలకు, ఎముకలకు బలాన్నిస్తాయి. లినోలియిక్ ఆసిడ్ బరువును నియంత్రించడంలో సహాయ పడుతుంది.

ఇక గోధుమలతో చేసే చపాతీలను తినడం ద్వారా కూడా బరువు సులభంగా తగ్గొచ్చు. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్, క్లోరిన్, సిలికాన్, జింక్, కాపర్, విటమిన్ బి, ఇలు పుష్కలంగా ఉన్నాయి.
 
అందుకే గోధుమలతో తయారు చేసిన చపాతీలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. ఇందులో ఫైబర్ బరువు పెంచదు. సో పనీర్-చపాతీ రెండింటిలోనూ ఆరోగ్యాన్ని బలం చేకూర్చే పోషకాలు పుష్కలంగా వున్నాయి. ఈ రెండింటి కాంబోలో పనీర్ చపాతీ ఎలా చేయాలో ట్రై చేద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
గోధుమపిండి - రెండు కప్పులు 
మైదా - ఒక కప్పు
పనీర్ తురుము - ఒక కప్పు 
ఉడికించిన ఆలు ముద్ద - ఒక కప్పు
కొత్తిమీర తరుగు- అర కప్పు 
పచ్చిమిర్చి పేస్టు - ఒక స్పూన్ 
జీలకర్రపొడి - చెంచా,
నెయ్యి - అరకప్పు.
ఉప్పు, నూనె - తగినంత 
 
తయారీ విధానం :
ముందుగా వెడల్పాటి బౌల్‌లో గోధుమ పిండి, మైదా, పనీర్ తురుము, ఆలు ముద్ద, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, జీలకర్రపొడి అన్నీ వేసి బాగా కలుపుకోపాలి. చపాతీ పిండిలా సిద్ధం చేసుకుని పక్కన బెట్టుకోవాలి. పావు గంట తర్వాత ఈ పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా వత్తుకుని పెనంపై వేయాలి. నెయ్యి వేసుకుంటూ రెండువైపులా దోరగా కార్చుకుని మష్రూమ్ మసాలా, చికెన్ గ్రేవీలతో బ్రేక్ ఫాస్ట్‌గా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్ గదిలో భార్యతో ఆమె ప్రియుడు, పట్టుకున్న భర్త, సరే విడాకులు తీసుకో అంటూ షాకిచ్చిన భార్య

Roja: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన ఆర్కే రోజా... మాటలకు, చేతలకు సంబంధం లేదు

పురుషులు గర్భందాల్చుతారా? భారత సంతతి వైద్యురాలికి వింత అనుభవం

వ్యాపారంలో నష్టం, 100 మంది పురుషులతో శృంగారం, డబ్బుకోసం బ్లాక్‌మెయిల్

గోల్కొండ కోట.. గోల్ఫ్ క్లబ్ ప్రాంగణంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nabha Natesh: నాగబంధం నుంచి పార్వతిగా సాంప్రదాయ లుక్ లో నభా నటేష్

Sai Durga Tej: పంచె కట్టు ధరించిన సాయి దుర్గతేజ్.. సంబరాల ఏటిగట్టు లుక్

రణధీర్ భీసు-హెబ్బా పటేల్ జంటగా మిరాకిల్ సంక్రాంతి లుక్

పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం పేరు 'స్లమ్ డాగ్'

NTR: బాడీ తగ్గించుకుని కొత్త లుక్ లో ఎన్.టి.ఆర్. - అనిల్ కపూర్ ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments