మెక్సికన్‌ రైస్‌ క్యాప్సికమ్ సలాడ్‌!

Webdunia
సోమవారం, 6 అక్టోబరు 2014 (18:27 IST)
కావలసిన పదార్థాలు :
బాస్మతి లేదా సన్న బియ్యం... 100గ్రాములు (పొడిగా ఉడికించి ఉంచాలి)
ఎర్రటి క్యాప్సికమ్‌... ఒకటి
పసుపురంగు క్యాప్సికమ్‌... ఒకటి
ఆకుపచ్చ క్యాప్సికమ్...ఒకటి
ఉల్లిపాయ... ఒకటి (సన్నగా తరిగినది)
వెనిగర్... ఒక టీస్పూను
నిమ్మరసం... అర టీస్పూను
మిరియాల పొడి... చిటికెడు
కొత్తిమీర... ఒక కట్ట
 
తయారీ విధానం :
ఉడికించిన అన్నాన్ని చల్లార్చాలి. క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కోసు ఉంచాలి. చల్లారిన అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో వేసి అందులో వెనిగర్‌, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, తురిమిన కొత్తిమీర వేసి చెక్క గరిటెతో నెమ్మదిగా కలపాలి. 
 
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపి, ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత క్యాప్సికమ్‌ ముక్కల్ని కూడా అన్నంలో వేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. వడ్డించేముందు ప్లేట్లలో సర్ది పైన ఇంకాస్త కొత్తిమీర చల్లితే మెక్సికన్‌ రైస్‌ సలాడ్‌ తయారైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు : మరో వైద్యుడు అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Show comments