"కోకో ఐస్‌క్రీం" ఇంట్లో తయారీ ఎలా..??

Webdunia
శుక్రవారం, 5 సెప్టెంబరు 2014 (18:53 IST)
కావలసిన పదార్థాలు :
పాలు.. ఒక లీటర్
క్రీం.. 500 మి.లీ.
పంచదార.. 100 గ్రా.
కోడిగుడ్లు.. పది
కోకో పౌడర్.. 6 టీ.
 
తయారీ విధానం :
ముందుగా ఒక పాత్రలో పాలు మరిగించి పక్కన ఉంచుకోవాలి. మరో పాత్రలో కోడిగుడ్ల తెల్లసొన మాత్రమే తీసుకోవాలి. ఇందులోనే పంచదార, మరిగించిన పాలు చేర్చి కలియబెట్టి తక్కువ మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమం కాసేపటి తరువాత కస్టర్డ్‌లాగా తయారవుతుంది. పూర్తిగా చల్లారిన తరువాత ఈ మిశ్రమానికి కోకో పౌడర్ చేర్చి, ఐస్ ట్రేలోకి పోసి డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి.
 
అలా ఐస్‌ ట్రేలలో పెట్టిన మిశ్రమం ఐస్‌క్యూబులా గట్టిగా మారుతుంది. తరువాత ఈ క్యూబును తీసి నీళ్లు పోయకుండా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని ట్రేలో పెట్టి నాలుగ్గంటలపాటు డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి. మళ్లీ దాన్ని తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బితే చల్ల చల్లగా నురగలు గక్కుతుండే కోకో ఐస్‌కీం సిద్ధమైనట్లే.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మందుబాబులను నడిరోడ్డుపై నడిపిస్తూ మత్తు వదలగొట్టారు...

తెలంగాణ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ : హరీశ్ రావు ధ్వజం

అంధకారంలో వెనెజువెలా రాజధాని - మొబైల్ చార్జింగ్ కోసం బారులు

చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం

వెనెజువెలా అధ్యక్షుడి నిర్భంధం.. ఇక మీ వంతేనంటూ ప్రత్యర్థులకు ట్రంప్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టైమ్ మెషీన్‍‌లో ఒక రౌండ్ వేసి వింటేజ్ చిరంజీవిని చూస్తారు : అనిల్ రావిపూడి

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Show comments