Webdunia - Bharat's app for daily news and videos

Install App

వానాకాలంలో నోరూరించే జీడిపప్పు చికెన్ ఫ్రై..

శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలకు ఉప్పు, పసుపు, పెరుగు, అల్లంవెల్లుల్లిముద్ద, ఉల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ పట్టించి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించి దించేయాలి

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (18:56 IST)
వర్షాకాలం వేడి వేడిగా స్నాక్స్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు బజ్జీలు, గారెలతో సరిపెట్టుకోకుండా జీడిపప్పు చికెన్‌ ఫ్రై ట్రైచేసి చూడండి. క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు పోరాడే జీడిపప్పు, బరువు నియంత్రించే చికెన్‌తో జీడిపప్పు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు : 
చికెన్‌: అరకేజీ,
జీడిపప్పు : అర కప్పు
ఉల్లి పేస్ట్ : అర కప్పు 
పసుపు : అర టీ స్పూన్ 
పచ్చిమిర్చి పేస్ట్ : పావు కప్పు 
అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు టేబుల్ స్పూన్లు  
కారం : రెండు టీ స్పూన్లు 
గరం మసాలా : అర టీ  స్పూన్ 
ఉప్పు, నూనె : తగినంత 
కొత్తిమీర తరుగు : కొద్దిగా 
 
తయారీ విధానం :
శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలకు ఉప్పు, పసుపు, పెరుగు, అల్లంవెల్లుల్లిముద్ద, ఉల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ పట్టించి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించి దించేయాలి. ఆరిన తర్వాత బాణలిలో నూనె పోసి కారం, చికెన్‌ ముక్కలు వేసి మీడియం మంటమీద వేయించాలి. చికెన్‌ పూర్తిగా ఉడికిన తర్వాత గరంమసాలా చల్లి, ఉప్పు సరిచూడాలి. విడిగా ఓ చిన్న పాన్‌లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి పేస్ట్ కరివేపాకు వేసి వేయించిచికెన్‌ముక్కల్లో కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేయాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments