Webdunia - Bharat's app for daily news and videos

Install App

"క్యారెట్ ఊతప్పం" తయారీ ఎలా?

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (13:05 IST)
కావలసిన పదార్థాలు :
బియ్యం.. ఒక కప్పు
మినప్పప్పు.. ఒక టి స్పూన్ 
మెంతులు.. ఒక టి స్పూన్ 
ఉప్పు.. తగినంత
వంటసోడా.. పావు టి స్పూన్ 
పచ్చిమిర్చి.. మూడు
ఉల్లిపాయ..ఒకటి
క్యారెట్ తురుము.. పావు కప్పు
టొమోటో.. ఒకటి
కొత్తిమీర.. సరిపడ
 
తయారీ విధానం :
బియ్యం, మినప్పప్పు, మెంతులను కలిపి నీటిలో సుమారు 8 గంటలపాటు నానబెట్టుకోవాలి. మరుసటి రోజు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా సుమారు 8 గంటలపాటు ఫ్రిజ్‌లో కాకుండా బయటే ఉంచాలి. పులిసిన పిండిలో ఉప్పువేసి బాగా కలియబెట్టాలి. ఊతప్పం వేయడానికి ముందు మాత్రమే సోడా వేసి కలపాలి.
 
పెనం వేడిచేసి ఒక టీస్పూన్ నూనె వేసి పెనమంతా రుద్దాలి. ఇప్పుడు గరిటెతో పిండిని పోసి మందంగా వేయాలి. మరో టీస్పూన్ నూనెని ఊతప్పం చుట్టూ వేయాలి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, టొమోటో, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగుల్ని వేయాలి. సిమ్‌లో 5 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత ఊతప్పంను ప్లేటులోకి మెల్లిగా తీయాలి. అంతే క్యారెట్ ఊతప్పం తయార్. ఇది  వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీ లేదా టొమోటో సాస్‌, సాంబార్‌లతో కలిపి తింటే రుచి అదిరిపోతుంది. ఆరోగ్యానికి మంచిది కూడా. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments