Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపిల్ టీ తాగితే.. ఒబిసిటీ మటాష్.. (వీడియో)

Webdunia
సోమవారం, 6 మే 2019 (13:24 IST)
ఆపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, వ్యాధులను వ్యతిరేకించే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఆపిల్స్‌లో పెక్టిన్ వంటి ఫైబర్ పుష్కలంగా ఉంది. ఆపిల్ పండ్ల రసంలో యాలకులు, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే కడుపులో మంట, పేగుల్లోని పూత, అజీర్తీ, కడుపు ఉబ్బరం, తేన్పులు, ఛాతీలో మంట తగ్గుతాయి. రోజుకు మూడు ఆపిల్ పండ్లు తింటూ ఉంటే రక్తక్షీణత, శక్తిహీనతల సమస్య తొలగిపోతుంది. 
 
ఎంత మంచి ఆహారం తిన్నా, ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు ఆపిల్స్ తీసుకుంటే ఆరోగ్యంగా వుంటారు. ఇంకా ప్రతి రోజూ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల మతిమరుపు నివారిస్తుంది. అలాంటి యాపిల్‌తో టీ తయారు చేసుకుని సేవిస్తే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. 
 
ఆపిల్ టీ తాగడం వలన రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది భేష్‌గా పనిచేస్తుంది. ఆపిల్ టీ తాగితే శరీర బరువును నియంత్రించుకోవచ్చు. కీళ్ళ నొప్పులు, ఉదర సంబంధిత సమస్యలను ఇది దూరం చేస్తుంది. అలాంటి ఆపిల్ టీ ఎలా చేయాలంటే.. 
 
ముందుగా మూడు గ్లాసుల నీటిని ఓ పాత్రలోకి తీసుకోండి. ఆపై శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకున్న ఆపిల్ ముక్కల్ని ఆ నీటిలో చేర్చి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత టీ పొడి, లవంగాలు, దాల్చినచెక్క కొంచెం వేసి కలిపి.. మరికాసేపు మరిగించాలి. అనంతరం కొంచెం తేనెను కలపాలి. ఆపై వడగట్టి కాస్త చల్లబడ్డాక తీసుకుంటే ఫిట్‌నెస్‌కు ఢోకా వుండదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments