Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైసీ డిష్ "చిల్లీ మష్రూమ్ విత్ నూడుల్స్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బటన్ మష్రూమ్స్ (పుట్టగొడుగులు).. 500 గ్రా.
క్యాప్సికమ్.. 200 గ్రా.
మీడియంసైజు ఉల్లిపాయలు.. 2
అల్లం.. 50 గ్రా
వెల్లుల్లి.. 6 పాయలు
నూనె.. 4 టీ.
కారంపొడి.. 1 టీ.
డార్క్ సోయా సాస్.. 2 టీ.
వెనిగర్.. 2 టీ.
కార్న్‌ఫ్లోర్.. 1 టీ.
మంచినీరు.. 1 కప్పు

తయారీ విధానం :
మష్రూమ్స్‌ను రెండుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్‌లను కూడా సగానికి కట్ చేసి వాటిలోని విత్తనాలను తీసివేయాలి. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిలను మెత్తగా పేస్ట్ చేయాలి. ఓ బాణలిలో 5 టీస్పూన్ల నూనెను వేడిచేసి, అందులో నూరిన మిశ్రమాన్ని వేసి వేయించాలి. అందులోనే కారంపొడి కూడా వేసి పావుకప్పు నీటిని చేర్చి, మిశ్రమం గట్టిపడేంతదాకా సిమ్‌లో ఉడికించాలి.

ఆ తరువాత క్యాప్సికమ్, మష్రూమ్ ముక్కల్ని వేసి తగినంత ఉప్పుకూడా చేర్చి కలిపి, మూతపెట్టి సిమ్‌లో బాగా ఉడికేంతవరకూ మగ్గించాలి. బ్లాక్ సోయాసాస్, వెనిగర్‌లను కూ ఆ మిశ్రమానికి కలిపి, కార్న్‌ఫ్లోర్‌ను కాసిన్ని నీటిలో వేసి కలిపి కూరలో పోయాలి. ఆపై ఒక నిమిషం సిమ్‌లో ఉడికించి దించేయాలి. అంతే చిల్లీ మష్రూమ్ రెడీ..! దీన్ని వేడి వేడిగా వెజిటబుల్ రైస్ లేదా నూడుల్స్‌తో కలిపి సర్వ్ చేస్తే సూపర్బ్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి మరి..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

ద్వారకా తిరుమలలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments