Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి తాపం తీరిపోవాలంటే.. లెమనేడ్స్ తాగండి.

Webdunia
FILE
ఎండలలో డీహైడ్రేషన్ రాకుండా ఉండటానికి నిమ్మరసం సాయపడుంది. నిమ్మలోని పలు నూనె పదార్థాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. అందుకే వేసవికాలంలో ప్రపంచం మొత్తం మీద లెమనేడ్స్ అమ్ముడుపోతుంది.

లెమనేడ్స్ అనేది ఒక జ్యూస్. అమెరికాలో అధికంగా ఈ జ్యూస్‌ను సేవిస్తారు. అలాగే నిమ్మరసం, నింబు-పాని, సిఖంజి, షర్బత్ ఇలా ఏ పేరుతో పిలిచినా, ఎండల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోడ్డుపక్కన అమ్మే షర్బతైనా, ఐదు నక్షత్రాల రెస్టారెంటులోని లెమనేడ్ అయినా దాహం తీర్చడంలో దీనికి సాటి మరొకటి లేదు.

సరిగ్గా కుదిరితే లెమనేడ్స్ ఎంతో రుచిగా ఉంటుంది.
కావలసినవి.. నిమ్మపండు, పంచదార, చల్లని నీరు. కొద్దిగా ఉప్పు.. ఆరెంజ్-- స్ప్రిగ్స్ స్లైస్ ఒకటి.
తయారీ విధానం.. నిమ్మపండును సన్నని స్లైస్‌గా కోసుకుని, ఒక గిన్నెలో వుంచాలి. ఆ ముక్కలపై పంచదార చల్లాలి. పప్పుగుత్తి వంటి దానితో ఈ మిశ్రమాన్ని చిదమాలి.

పంచదార కరుగుతూ.. నిమ్మరసం తయారవుతుంది. ఈ రసాన్ని వడపోయాలి. కావలసినంత మంచినీరు, ఐసు ముక్కలు వేసుకుని పావు చెంచా ఉప్పు వేసుకోవాలి. మరికాస్త రుచికోసం ఓ ఆరెంజ్ స్లైస్‌ని, పుదీనా రెమ్మను, కాస్త మిరియాల పొడి, యాలకుల పొడిని కలుపుకోవచ్చు.

అదనంగా.. లెమనేడ్‌కి కాస్త తేనె కలపడంతో కొత్త రుచి వస్తుంది. చల్లని నీటితో కాకుండా గోరువెచ్చని నీటితోనూ ఈ జ్యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా అల్లం రసం, పుదీనా, స్ట్రాబెర్రీ కలుపుకోవచ్చు.

* ఇక నింబు పాని చేయడం చాలా సులభం. నిమ్మరసం, చక్కెర, చల్లని నీరు, ఉప్పు వేస్తే నింబుపాని తయార్.

* షికంజి-1 ఎలా చేయాలంటే.. అరకప్పు వేయించిన జీలకర్ర పొడి, ఒక చెంచా నల్లమిరియాల పొడి, ఒకటిన్నర చెంచా నల్లఉప్పు, వీటిని మిక్సిలో వేసి పొడి చేసి గాలి దూరని ప్లాస్టిక్ డబ్బాలో దాచుకోవాలి.
తయారీ.. ఒక గ్లాసు నీటికి కొద్దిగా నిమ్మరసం ఒక చెంచాపై చెప్పిన షికంజి పొడి, ఐసు ముక్కలేసి బాగా కలిపితే షికంజి లెమన్ రెడీ.

* షికంజి- 2 ఎలా చేయాలంటే.. ఒక నిమ్మపండు.. రెండు చెంచాల పంచదార, నల్ల ఉప్పు కాల్ స్పూన్, సోడావాటర్ లేదా చల్లని నీరు ఒక గ్లాసు. పుదీన రెమ్మ ఒకటి.
తయారీ.. నిమ్మరసంలో పంచదార కలపాలి. కొద్దిగా నల్ల ఉప్పు కలిపి, ఐసు నీరు కలపాలి. పుదీనా రెమ్మలతో సర్వ్ చేయాలి.

* చివరిగా మింట్-లెమన్ స్లష్.. 12 నిమ్మపండ్లు, రెండున్నర కప్పు తరిగిన పుదీన, తగినంత ఐసు ముక్కలు, చల్లని నీళ్ళు. ఒకటింపావు కప్పు పంచదార.

తయారీ.. నిమ్మ, పుదీన, పంచదార, ఐసులు కలిపి మిక్సీలో వేయాలి. ఆ రసాన్ని ఓ పాత్రలో పోసి డీప్ ఫ్రిజ్‌లో వుంచాలి. తిరిగి ఈ ఐస్ ముక్కల్ని మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. తిరిగి చల్లగా సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

Show comments