Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెజిటబుల్‌ జెల్లీ పాలక్ స్లైస్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
పాలకూర... రెండు కట్టలు
క్యారెట్... వంద గ్రా.
జెలాటిన్.. ఒక టీ.
ఉప్పు... తగినంత
మిరియాలపొడి... అర టీ.
జాజికాయపొడి... చిటికెడు

తయారీ విధానం :
క్యారెట్‌ తొక్క తీసి సన్నగా తరిగి, మిక్సీలో వేసి గుజ్జులా చేయాలి. పాలకూరని కడిగి శుభ్రం చేసి ఉడికించి, మెత్తగా గ్రైండ్‌ చేయాలి. చిన్న గిన్నెలో జెలాటిన్‌ను వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. తరవాత ఈ గిన్నెను వేడినీళ్లలో ఉంచి కరిగించాలి. తరువాత ఈ మిశ్రమం సగాన్ని క్యారెట్ గుజ్జులోనూ, మరో సగం పాలకూర గుజ్జులోనూ వేసి కలపాలి.

తరువాత క్యారెట్, పాలకూర గుజ్జు రెండింట్లోనూ ఉప్పు, మిరియాలపొడి, జాజిపొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు బేకింగ్ టిన్ తీసుకుని దానికి నూనె పూసి ముందుగా పాలకూర గుజ్జుని పోసి 20 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత క్యారెట్ గుజ్జును కూడా అందులోనే పోసి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టి అరగంటసేపు ఉంచాలి.

తరువాత బేకింగ్ టిన్‌ను ఫ్రిజ్‌నుంచి బయటికి తీసి సర్వింగ్ ప్లేటులో బోర్లించాలి. కావాల్సిన సైజుల్లో ముక్కలుగా కోసి చల్లచల్లగా అతిథులకు సర్వ్ చేయాలి. అంతే వెజిటబుల్‌ జెల్లీ పాలక్ స్లైస్‌ తయారైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

పుష్ప-2 ఐటం గర్ల్‌గా శ్రీలీల..!!

రెండు రోజుల్లోనే కలెక్షన్స్ షేక్ చేస్తున్న కిరణ్ అబ్బవరం క మూవీ

Show comments