Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిటిల్స్ హెల్దీ ఫుడ్ "ఎగ్ ఫుడ్డింగ్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
కోడిగుడ్లు.. ఆరు
పాలు.. ఒక లీటర్
పంచదార.. పావు కేజీ
యాలకుల పొడి.. కాస్తంత
జీడిపప్పు, ఎండుద్రాక్ష... తగినన్ని
నెయ్యి.. రెండు టీ.

తయారీ విధానం :
ముందుగా గుడ్లను పగులగొట్టి ఓ పాత్రలో వేసి బాగా బీట్ చేసుకోవాలి. లోతైన గిన్నెలో నెయ్యి వేసి వేడి అయిన తరువాత జీడిపప్పు, కిస్ మిస్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పాలను బాగా మరిగించాలి. మరిగించిన పాలల్లో పంచదార కలిపి చల్లారనిచ్చి బీట్ చేసిన కోడిగుడ్ల మిశ్రమం, యాలకుల పొడిని కలపాలి.

ఈ మిశ్రమాన్ని జీడిపప్పు, కిస్‌మిస్ ఉన్న గిన్నెలో పోయాలి. ఫ్రెషర్ పాన్‌లో ఒక గ్లాసు నీరు పోసి దానిలో ఈ మిశ్రమం గిన్నెను ఉంచి మూతపెట్టి విజిల్ పెట్టకుండా ఆవిరిమీద పదినిమిషాలపాటు ఉడికించి దించేయాలి. మూత తీస్తే అది చూసేందుకు జున్నులాగా ఉంటుంది. దీన్ని వేరే గిన్నెలోకి తీసి బాగా చల్లార్చి ఫ్రిజ్‌లో ఉంచాలి.

చల్లబడిన తరువాత ఓ బౌల్‌లో పెట్టి సర్వ్ చేయాలి. అంతే ఎగ్ ఫుడ్డింగ్ సిద్ధమైనట్లే..! ఇది చిన్నారులకు చాలా బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది. చల్లగా వద్దనుకునేవారు ఫ్రిజ్‌లో ఉంచకుండా అలాగే ఆరగించవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments