Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాతో వండర్స్ "స్టఫ్‌డ్‌ కుల్చాలు"

Webdunia
కావలసిన పదార్థాలు :
మైదా... నాలుగు కప్పులు
పెరుగు... ఒక కప్పు
బేకింగ్ సోడా... అర టీ.
నెయ్యి... అర కప్పు
ఉప్పు... తగినంత
బంగాళాదుంపలు.. మూడు
జీలకర్రపొడి.. ఒక టీ.
గరంమసాలా... అర టీ.
నూనె... మూడు టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక ఈ చిదిమిన దుంపలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత గరంమసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి తక్కువ మంటమీద ఓ ఐదు నిమిషాలు వేయించి దించాలి.

మైదాలో ఉప్పు, బేకింగ్‌సోడా వేసి కలపాలి. తరువాత పాలు, నెయ్యి, పెరుగు వేసి నెమ్మదిగా కలపాలి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చల్లాలి. పిండి కలుపుకున్న తరువాత తడిబట్ట కప్పి 2 గంటలు ఉంచాలి. ఆపై పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, ఒక్కోదాన్ని చిన్న పూరీలాగా వత్తాలి. వాటిలో పైన తయారు చేసిన దుంపల స్టఫ్‌ను అందులో పెట్టి అంచులను మూసివేసి చపాతీల్లాగా వత్తాలి. వీటిని వేడి పెనంమీద నెయ్యితో ఎర్రగా కాల్చితే కుల్చాలు రెడీ...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

Show comments