Webdunia - Bharat's app for daily news and videos

Install App

మష్రూమ్‌ కట్‌లెట్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు... పావు కేజీ
బంగాళాదుంపలు... పావు కేజీ
ఉల్లిపాయలు... మూడు
పచ్చిమిర్చి... ఐదు
కొత్తిమీర... మూడు కట్టలు
మిరియాలపొడి... అర టీ.
ఉప్పు... తగినంత
నిమ్మకాయ... ఒకటి
కోడిగుడ్డు... ఒకటి
బ్రెడ్‌ పొడి... వంద గ్రా.
నూనె... వేయించేందుకు తగినంత

తయారీ విధానం :
పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి, నీళ్లలో మరిగించి సన్నని ముక్కలుగా కోయాలి. బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి. ప్రెషర్‌పాన్‌లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించాలి. అందులోనే ఉడికించిన బంగాళాదుంపల పొడి వేయాలి. ఆపై తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి.

తరువాత పుట్టగొడుగుల్ని కూడా వేసి కలిపి వేయించి, దించి ఆరాక చిన్న వడల్లాగా చేయాలి. కోడిగుడ్డు సొనను గిలకొట్టి అందులో కొంచెం ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పుట్టగొడుగు వడల్ని ఈ సొనలో ముంచి, బ్రెడ్‌ పొడిలో దొర్లించి నూనెలో ఎర్రగా వేయించి తీసేయాలి. వీటిని టొమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెయిల్యూర్ ఉన్న ప్రతి నటుడికి క నిదర్శనం: కిరణ్ అబ్బవరం

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

Show comments