Webdunia - Bharat's app for daily news and videos

Install App

భల్లే భల్లే... "మ్యాకరోనీ భేల్"

Webdunia
కావలసిన పదార్థాలు :
మ్యాకరోనీ... 200 గ్రా.
వేరుశెనగపప్పు... పది టీ.
పుట్నాలపప్పు... ఎనిమిది టీ.
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... ఆరు
కొత్తిమీర... రెండు చిన్న కట్టలు
కారం... కాస్తంత
నూనె... నాలుగు టీ.
ఉప్పు... తగినంత
నిమ్మకాయలు... రెండు
సన్నకారప్పూస... వంద గ్రా.

తయారీ విధానం :
వెడల్పాటి పాత్రలో ముప్పావువంతు నీరుపోసి స్టౌపై పెట్టాలి. నీరు బాగా మరుగుతుండగా మ్యాకరోనీ, తగినంత ఉప్పు, ఒక టీ. నూనె వేసి ఉడికించాలి. మ్యాకరోని మెత్తగా ఉడికాక వేడినీటిని వంపేసి, అందులో వెంటనే చన్నీటిని పోయాలి. ఇలా చేస్తే మ్యాకోరోని ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది.

ఇప్పుడు ఒక బాణలిలో మిగిలిన నూనె పోసి వేరుశెనగపప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. దీనికి ఉల్లిపాయ తరుగు, కారం, కొత్తిమీర తరుగు, పుట్నాలపప్పు, తగినంత ఉప్పును కలిపి వేయించాలి. రెండు నిమిషాల తరువాత, ఉడికించి ఉంచిన మ్యాకరోనీని వేసి కలిపి దించేయాలి.

వడ్డించేముందు దానిపై నిమ్మరసం పిండి, సన్నకారప్పూస అక్కడక్కడా చల్లితే మ్యాకరోనీ భేల్ రేడీ అయినట్లే... ఇష్టాన్ని బట్టి అవసరమైతే ఇందులో మరికొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments