Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో మీకు తెలుసా?

Webdunia
FILE
చికెన్ వండటంలో రెండు మూడు వెరైటీలు తప్ప ఎక్కువగా తెలియవా? అయితే వెంటనే క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రిసిపిని ట్రై చేయండి.

కావలసిన పదార్థాలు :
కోటింగ్ 1
మైదా: అరకప్పు
కోటింగ్ 2 :
గుడ్లు: 2 (గిలకొట్టాలి)
పాలు: రెండు కప్పులు
చికెన్ సూప్ క్యూబ్: ఒక టీ స్పూన్
పార్స్లీ: 1 టేబుల్ స్పూన్
తురుమిన వెల్లుల్లి: రెండు రెబ్బలు

సోయా సాస్: ఒక టీ స్పూన్

కోటింగ్ : 3
మైదా: ఒక కప్పు
బ్రెడ్ ముక్కలు: రెండు కప్పులు
ఉల్లిపాయ పేస్ట్: పావు టీ స్పూన్
మిరపకాయ పేస్ట్: అర టీ స్పూన్
బ్లాక్ మిరియాలు: రెండు టీ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా

వెల్లుల్లి పేస్ట్: అర టీ స్పూన్


ఫ్రైయింగ్ కోసం :
నూనె - తగినంత
చికెన్ లెగ్స్ : 8

తయారీ విధానం:
ముందుగా కుక్కర్లో శుభ్రం చేసిన చికెన్ లెగ్ పీస్‌లను పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూడుసార్లు కోటింగ్ కోసం తీసుకున్న పదార్థాలను.. విడివిడిగా సపరేట్‌గా బౌల్స్ వేసి మిక్స్ చేసి పక్కనబెట్టుకోవాలి.

తర్వాత బాణలి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి, మీడియం వేడి మీద ముందుగా ఉడికించి పెట్టుకొన్న చికెన్ లెగ్స్‌ను వేపుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకొన్న తర్వాత మొదట చికెన్ లెగ్స్‌ను మొదటి కోట్ అంటే మైదాపిండిని కోట్ చేయాలి. మైదాలో అద్దిన ఈ లెగ్ పీసులను పాలలో డిప్ చేయాలి (2వ కోటింగ్) చివరి కోటింగ్ బ్రెడ్ పొడిలో వేసి పొర్లించాలి (3వ కోటింగ్).

ఇలా మూడు సార్లు కోట్ చేసిన తర్వాత మరో సారి డీప్ ఫ్రై చేయాలి. చికెన్ లెగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌కు చేరుకోగానే, వాటిని బయటకు తీసి పేపర్ టవల్ మీద ప్లేస్ చేయాలి. దాంతో అదనపు నూనె పీల్చేస్తుంది. అంతే మీ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రెడీ. ఈ క్రిస్పీ చికెన్‌ను టమోటో సాస్ లేదా ఉల్లిపాయ రింగ్స్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చీకట్లో ఏకాంతంగా గడిపిన ప్రేమికులు.. పట్టుకుని గుండు గీయించిన స్థానికులు...

తెలంగాణాలో మూడు రోజుల వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

Show comments