Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ప్రాన్ ఛాప్స్" విత్ పుదీనా చట్నీ

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
రొయ్యలు.. అర కేజీ
నిమ్మకాయలు.. రెండు
కారంపొడి.. ఒక టీ.
బ్రెడ్ పౌడి.. 50 గ్రా.
రీఫైన్డ్ ఆయిల్.. తగినంత
కొత్తిమీర.. 2 కట్టలు
అల్లంవెల్లుల్లి రసం.. 3 టీ.
గుడ్డు.. ఒకటి
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
ముందుగా పెద్ద సైజు రొయ్యలను తీసుకుని, తోక అలానే ఉంచి మిగిలిన రొయ్యను పెంకు ఒలిచి శుభ్రం చేయాలి. ఇలా శుభ్రం చేసిన రొయ్యలను చాకుతో మధ్యకు సగం తోకవరకు చీల్చి పుస్తకంలా విడదీసి చాకు వెనుక భాగంతో నొక్కాలి. ఇలా చేయటంవల్ల రొయ్య వెడల్పు అవుతుంది.

తర్వాత వీటిని ఒక ట్రేలో అమర్చి.. వాటిపై సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, అల్లం వెల్లుల్లి రసం, కారంపొడి చల్లి అరగంటసేపు నానబెట్టాలి. తర్వాత ఆ రొయ్యలు ఒక్కోదాన్ని తీసుకుని.. గుడ్డు సొనలో ముంచి, బ్రెడ్ పౌడర్‌లో పొర్లించి బాగా మరుగుతున్న నూనెలో వేసి ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే ప్రాన్ ఛాప్స్ సిద్ధం.. వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే పుదీనా చట్నీతో కలిపి తింటే అద్భుతంగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments