Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనీర్ స్టిక్స్ ఎలా చేయాలో తెలుసా!?

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2012 (17:46 IST)
FILE
కావలసిన పదార్థాలు :
పనీర్ : 200 గ్రాములు
పచ్చిమిర్చి తురుము : ఒక టేబుల్‌ స్పూను.
వెల్లుల్లి తురుము : ఒక టీ స్పూను.
పుదీనా పేస్ట్ : ఒక టీ స్పూను.
ఎండు మిర్చి : రెండు.
కారం : చిటికెడు.
ఫుడ్‌ కలర్‌ (ఎల్లో) : చిటికెడు.
నిమ్మకాయ : సగం.
నూనె : వేయించడానికి తగినంత.
‌ కోడిగుడ్డు : ఒకటి.
అజనొమోటో : అర టీ స్పూను.
మిరియాలపొడి : అర టీ స్పూను.
ఉప్పు : రుచికి తగినంత.

తయారీ విధానం :
ముందుగా పనీర్‌ను స్టిక్స్‌లా కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ స్టిక్స్‌కు మైదా, అజనొమోటో, కార్న్‌ఫ్లోర్‌, అజనొమోటో, మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, ఫుడ్‌ కలర్‌ కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి.

స్టిక్స్‌కు అన్ని వైపులా మిశ్రమం కవర్‌ అయ్యేటట్లు చూసుకోవాలి. సరిపోలేదంటే మరో కోడిగుడ్డును కూడా వాడుకోవచ్చు. ఈ మిశ్రమం పట్టంచిన స్టిక్స్‌ను ఐదు నిమిషాల ఉంచి తర్వాత స్టిక్స్‌ను నూనెలో దోరగా వేయించి పక్కనబెట్టుకోవాలి.

మరో బాణలిలో నూనె వేడయ్యాక నెయ్యి, వెన్న చెరో అర స్పూన్ వేయాలి. వేడైన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి. వేగాక నిమ్మరసం, కారం, అజనమోటో వేసి తాలింపును సమంగా కలిపి వేయించిన పనీర్ స్టిక్స్‌ను కలపాలి. అంతే పనీర్ స్టిక్స్ రెడీ..
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

ఇరాన్‌కు ఆయనే ప్రధాన శత్రువు - డోనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర : నెతన్యాహు

Married Couple: ప్రేమించి పెళ్లి.. నెల తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Show comments