Webdunia - Bharat's app for daily news and videos

Install App

"నవాబి ఆలూ"... సూపర్ టేస్టీ..!!

Webdunia
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... అర కేజీ
నెయ్యి... వేయించేందుకు సరిపడా
బాదంపప్పు... పది
ఉప్పు... తగినంత
పెరుగు... ఐదు టీ.
కుంకుమపువ్వు... 4 రేకలు
అల్లం వెల్లుల్లి ముద్ద... రెండు టీ.
మిరియాలపొడి... ఒక టీ.
శెనగపిండి... నాలుగు టీ.
మీగడ... ఒక కప్పు
కారం... అర టీ.

తయారీ విధానం :
బంగాళాదుంపల పొట్టు తీసి మందపాటి చాకుతో నాలుగైదు చోట్ల గాట్లు పెట్టాలి. తరువాత వీటిని ఉప్పు కలిపిన నీళ్లలో వేసి 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీళ్లన్నీ వంపేసి పలుచని బట్టతో తడి లేకుండా తుడవాలి. ఇప్పుడు బాదంపప్పుముక్కల్ని బంగాళాదుంపల్లోకి గుచ్చి ఉంచాలి.

బంగాళాదుంపలకు నీళ్లు లేకుండా తీసివేసిన పెరుగు, అల్లంవెల్లుల్లి, మిరియాల పొడిలో దొర్లించి 10-12 నిమిషాలు పక్కన ఉంచాలి. తరువాత వీటిమీద నెయ్యి రాసి ఓవెన్‌లోగానీ కుక్కర్‌లోగానీ ఉడికించాలి. శెనగపిండిలో మీగడ, ఉప్పు, కారం కలిపి పలుచని మిశ్రమంలా కలిపి, ఉడికించిన బంగాళాదుంపల్ని ఇందులో ముంచి నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. అంతే సూపర్ టేస్టుతో అలరించే నవాబీ ఆలూ రెడీ..! వీటిని ఏదైనా సాస్‌తో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

Show comments