Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుంపలతో నోరూరించే "పొటాటో స్టిక్స్‌"

Webdunia
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... నాలుగు
నూనె... తగినంత
కరివేపాకు... పది రెమ్మలు
కొత్తిమీర... ఒక కట్ట
మినప్పప్పు... అర కప్పు
సెనగపప్పు... అర కప్పు
జీలకర్ర... పావు కప్పు
ఎండుమిర్చి... ఆరు
వెలుల్లి... పది రెబ్బలు

తయారీ విధానం :
బంగాళాదుంపల్ని తొక్క తీసి కడగాలి. వాటిని సన్నగా పొడవుగా ముక్కలుగా కోసి ఉప్పు వేసిన నీళ్లలో వేయాలి. ఇలా ముక్కలన్నింటినీ ఉప్పునీళ్లలో వేసిన తరువాత నీళ్లన్నీ వంపేసి, ముక్కల్ని గట్టిగా నీళ్లులేకుండా పిండేయాలి. ఆపై వీటిని చిల్లుల ప్లేటులో వేసి నీళ్లు లేకుండా ఆరనివ్వాలి. పేపర్‌కర్చీఫ్‌తో మిగిలిన తడిని కూడా అద్దేసి కాసేపు ఆరనివ్వాలి.

బాణలిలో నూనె మరుగుతుండగా ఆరబెట్టిన బంగాళాదుంప ముక్కలను వేసి కరకరలాడేలా వేయించి తీసేయాలి. అదే బాణలిలో నూనె అంతటినీ వంపివేసి, అందులో ఎండుమిర్చి, వెల్లుల్లిలను వేయించాలి. ఆపై స్టవ్‌పై మరో బాణలిపెట్టి అందులో మినప్పపు, సెనగపప్పు, జీలకర్ర వేసి నూనె లేకుండా వేయించి చల్లారబెట్టి మిక్సీలో వేసి మెత్తగా నూరాలి. ఇందులో వేయించిన ఎండుమిర్చి, వెల్లుల్లిలను కూడా వేసి నూరాలి.

ఇప్పుడు ముక్కలు వేయించిన బాణలిలోనే ఓ టీస్పూను నూనె వేసి కరివేపాకు, కొత్తిమీర తురుము వేయాలి. అవి వేగాక పొటాటో స్టిక్స్‌, పప్పులపొడి, తగినంత ఉప్పు చల్లి కలియబెట్టి సర్వ్ చేయాలి. అంతే పొటాటో స్టిక్స్ రెడీ.. వీటిని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ో
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

Show comments