Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిలాటిన్ స్పెషల్ "మాషే మెలోస్"

Webdunia
కావలసిన పదార్థాలు :
పంచదార... ఒక కేజీ
ఐసింగ్ షుగర్... పావు కేజీ
జిలాటిన్... 60 గ్రా.
వెనీలా ఎసెన్స్... రెండు టీ.

తయారీ విధానం :
ఒక గిన్నెలోకి జిలాటిన్‌ను తీసుకుని దాంట్లో నీరుపోసి బాగా కలిపి నానబెట్టాలి. అది నీటిని పీల్చుకుని గట్టిపడుతుంది. తరువాత ఒక పళ్ళెంలో నీరుపోసి సన్నని మంటపై ఉంచి దాంట్లో జిలాటిన్ ఉన్న గిన్నెను పెట్టి వేడిచేస్తే అది కరుగుతుంది. కరిగిన జిలాటిన్‌లో పంచదార పోసి తీగలాగా స్పూన్‌నుంచి మిశ్రమం జారేంతదాకా ఉడికించాలి.

ఆ తర్వాత గిన్నెను దించి దాంట్లో రెండు టీస్పూన్ల వెనీలా ఎసెన్స్‌ను వేసి, ఎగ్‌బీటర్ గట్టిపడేలా కొట్టాలి. దాన్ని మూడు భాగాలుగా చేసి.. ఒక భాగానికి పింక్ కలర్, మరో భాగానికి ఎల్లో కలర్ వేసి కలిపి ఉంచాలి. ఒక ట్రేలో ఐసింగ్ షుగర్‌ను, కొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ను చల్లి ఎల్లోకలర్ జిలాటిన్‌ను పోయాలి.

దానిపై రంగు కలపని జిలాటిన్‌ను ఉంచి, దానిపై పింక్ జిలాటిన్‌ను పోసి 5 నుంచి 6 గంటలపాటు కదపకుండా ఉంచాలి. మిశ్రమం బాగా గట్టిపడిన తరువాత స్క్వేర్ బిట్స్‌లాగా కట్ చేసుకుని మళ్లీ కార్న్‌ఫ్లోర్, ఐసింగ్ షుగర్ మిశ్రమంలో దొర్లించి సర్వ్ చేయాలి. అంతే మాషే మెలోస్ రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

Show comments