Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైల్డ్ ఫేవరేట్ ఫుడ్ "రైస్ క్రొకెట్సు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
అన్నం.. రెండు కప్పులు
మైదా పిండి.. అర కప్పు
బీన్స్.. 50 గ్రా.
కాలీఫ్లవర్.. ఒక కప్పు
పచ్చిబఠానీలు.. 50 గ్రా.
క్యారెట్.. ఒకటి
ఉప్పు.. తగినంత
మిరియాలపొడి.. కొద్దిగా
నూనె.. తగినంత

వైట్‌సాస్ తయారీ కోసం..
కార్న్‌ఫ్లోర్.. రెండు టీ.
మిరియాలపొడి.. అర టీ.
ఉప్పు.. తగినంత
పాలు.. ఒక గ్లాసు
వెన్న.. కొద్దిగా

తయారీ విధానం :
వైట్‌సాస్ తయారు చేసేందుకు బాణలిలో వెన్నను వేడిచేసి అందులో పాలు, కార్న్‌ఫ్లోర్ కలిపి మరుగుతుండగా ఉప్పు, మిరియాలపొడి చేర్చి బాగా కలిపి పక్కనుంచాలి. కూరగాయల్ని చిన్న ముక్కలుగా తరిగి ఉడికించి నీరు వార్చి ఉంచాలి. వీటిని వైట్‌సాస్‌తో కలిపి సన్నటి మంటమీద ఉడికించి చల్లార్చి పక్కనుంచాలి.

అన్నంలో మైదాపిండిని కలిపి మెత్తటి ముద్దగా చేసి.. అందులో తగినంత ఉప్పు, మిరియాలపొడి, కాస్తంత నీరు చేర్చి ముద్దలా చేయాలి. అరటి ఆకుపై నూనె రాసి మైదా ముద్దను కొద్దిగా తీసి వేసి వెడల్పుగా వత్తి, మధ్యలో వైట్‌సాస్‌లో కలిపిన కూరగాయల మిశ్రమాన్ని ఉంచి నిలువుగా మడిచి పొడవుగా వత్తాలి. అలా మొత్తం చేసుకున్న తరువాత కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా కాల్చి తీసేయాలి. వీటిని ఏదేని సాస్‌తో కలిపి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments