Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చెర్రీ కేక్"తో కలర్‌ఫుల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదాపిండి.. అర కప్పు
కండెన్స్‌డ్ మిల్క్.. ఒక టీ.
వెన్న.. 8 టీ.
ఐసింగ్ షుగర్.. 300 గ్రా.
చెర్రీపండ్లు.. 200 గ్రా.
వంటసోడా.. 2 టీ.
ఉప్పు.. అర టీ.
స్ట్రాబెర్రీ ఎసెన్స్.. అర కప్పు
ఎరుపు మిఠాయి రంగు.. అర టీ.
వేడినీరు.. 4 టీ.

తయారీ విధానం :
ముందుగా కండెన్స్‌డ్ మిల్క్‌లో వేడినీళ్లు, కరిగించిన వెన్న వేసి బాగా గిలకొట్టాలి. దాంతోపాటు ఉప్పు, వంటసోడా, చెర్రీ పండ్లను మైదాపిండిలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ డబ్బాలో బ్రౌన్ పేపర్‌ను పరచి, తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి అరగంటపాటు ఓవెన్‌లో ఉంచాలి. ఈ సమయంలో ఉష్ణోగ్రత 350 డిగ్రీలు దాటకుండా చూడాలి.

అది ఉడికేంతలోపు ఐసింగ్ షుగర్, మిఠాయి రంగు పొడిని మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. ఓవెన్‌లో ఉడికించిన కేక్‌ను తీసి ఐసింగ్ షుగర్ మిశ్రమాన్ని దానిపై పోయాలి. అంతే చెర్రీ కేక్ తయారైనట్లే..! దీన్ని సర్వ్ చేసే ముందు నచ్చిన పండ్ల ముక్కలతో అలంకరిస్తే కలర్‌ఫుల్‌గా ఉండటమేగాక, ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకేముంది.. చెర్రీ కేక్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతారు కదూ...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

ద్వారకా తిరుమలలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments