Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ కటీరోల్

Webdunia
కావలసిన పదార్థాలు :
చికెన్.. పావు కేజీ
గోధుమపిండి.. వంద గ్రా.
మైదా.. పావు కేజీ
కొత్తిమీర.. రెండు కట్టలు
నూనె.. వంద మి.లీ.
కారం.. అర టీ.
గుడ్డు.. ఒకటి
పచ్చిమిర్చి.. ఆరు
ఛాట్ మసాలా.. అర టీ.
ఉప్పు.. తగినంత
అల్లం వెల్లుల్లి.. పావు టీ.

తయారీ విధానం :
గోధుమ, మైదా పిండిలను కలిపి, తగినంత ఉప్పు చేర్చి, నీళ్లుపోసి మెత్తటి చపాతీ పిండిలా కలిపి.. ముద్దలుగా చేయాలి. వీటిని అట్లకాడతో పలుచటి చపాతీల్లా చేసి పక్కనుంచాలి. గిన్నెలో గుడ్డు పగులగొట్టి, దానికి పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, సరిపడా ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.

ఆపై ఓ గిన్నలో చికెన్ వేసి దాంట్లో కాస్త ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని చేర్చి మెత్తగా ఉడికించి.. ఆ మాంసాన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అట్ల పెనంమీద చపాతీలను రెండువైపులా కాల్చి నాలుగు టీస్పూన్ల నూనె పూసి, ఓవైపు గుడ్డు మిశ్రమాన్ని పూసి ఉడికించాలి. పైన చికెన్ ముక్కల్ని, ఛాట్ మసాలాను చల్లి.. చుట్ట చుట్టి వేడిగా ఉండగానే చాకుతో ముక్కలుగా కోసి.. టొమోటో సాస్‌తో సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments