Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కోకో ఐస్‌క్రీం" ఇంట్లో తయారీ ఎలా..??

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పాలు.. ఒక లీటర్
క్రీం.. 500 మి.లీ.
పంచదార.. 100 గ్రా.
కోడిగుడ్లు.. పది
కోకో పౌడర్.. 6 టీ.

తయారీ విధానం :
ముందుగా ఒక పాత్రలో పాలు మరిగించి పక్కన ఉంచుకోవాలి. మరో పాత్రలో కోడిగుడ్ల తెల్లసొన మాత్రమే తీసుకోవాలి. ఇందులోనే పంచదార, మరిగించిన పాలు చేర్చి కలియబెట్టి తక్కువ మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమం కాసేపటి తరువాత కస్టర్డ్‌లాగా తయారవుతుంది. పూర్తిగా చల్లారిన తరువాత ఈ మిశ్రమానికి కోకో పౌడర్ చేర్చి, ఐస్ ట్రేలోకి పోసి డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి.

అలా ఐస్‌ ట్రేలలో పెట్టిన మిశ్రమం ఐస్‌క్యూబులా గట్టిగా మారుతుంది. తరువాత ఈ క్యూబును తీసి నీళ్లు పోయకుండా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని ట్రేలో పెట్టి నాలుగ్గంటలపాటు డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి. మళ్లీ దాన్ని తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బితే చల్ల చల్లగా నురగలు గక్కుతుండే కోకో ఐస్‌కీం సిద్ధమైనట్లే. ఇది అచ్చం మార్కెట్లో దొరికేదిలాగే ఉంటుంది. రుచికి రుచి, పోషకాలు అపారంగా ఉండే ఈ కోకో ఐస్‌క్రీంను చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఇష్టంగా తింటారు. మరి మీరూ..?!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

ద్వారకా తిరుమలలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments