Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా పులావ్ తయారీ ఎలా?

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (17:15 IST)
కావలసిన పదార్థాలు :
పచ్చి బియ్యం - 500 గ్రాములు, 
ఉడికించిన బఠాణీలు - కప్పు, 
కోడిగుడ్డు - రెండు, 
వెల్లుల్లి - రెండురెబ్బలు, 
సోయాసాస్ - రెండు చెంచాలు, 
మిరియాలపొడి - చెంచా, 
నూనె లేదా నెయ్యి - ఐదు చెంచాలు, 
ఉప్పు - తగినంత.
 
తయారు చేయు విధానం :
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం బిరుసుగా వండుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను తోలు తీసి మెత్తగా నూరుకోండి. ఓ బాణాలిలో నూనె కానీ నెయ్యి కానీ వేసి కాగాక అందులో వెల్లుల్లి ముక్కలను వేసి దోరగా వేయించండి. ఆ తర్వాత అందులో ఉడికించిన బఠాణీలు వేసి బాగా కలపాలి. ఇందులో కోడి గుడ్లను పగుల గొట్టి వేయాలి. కాసేపయ్యాక అందులో మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి తిప్పాలి. రెండు నిముషాలయ్యాక సోయా సాస్ వేసి కలిపి ఉడికించిన అన్నాన్ని వేసి కలిపి దించినట్టయితే ఇదే చైనా పులావ్. దీన్ని వేడిగా సర్వ్ చేస్తూ ఆరగిస్తే టేస్టీగా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

Show comments