హనీ చికెన్‌ ఎలా చేయాలో తెలుసా?

Webdunia
సోమవారం, 7 జనవరి 2013 (16:37 IST)
FILE
హనీ చికెన్ ఓ చైనా వంటకం. ఎప్పుడూ చికెన్‌తో ఫ్రై, 65లు చేసుకోవడం కంటే వ్యత్యాసంగా హనీ చికెన్ ట్రై చేయండి. దీని టేస్ట్ యమాగా ఉంటుంది. ఈ వీక్ ఎండ్ హనీ చికెన్ మీ ఇంట్లోనే ట్రై చేయండి..

కావలసిన పదార్థాలు :
బోన్ లెస్ చికెన్ : అరకిలో
బటర్ : 4 స్పూన్లు
కార్న్ ఫ్లోర్ : అర కప్పు
సోడా పిండి: చిటికెడు
కోడి గుడ్డులోని తెల్లసొన : ఒకటి

సాస్ తయారీకి..
నూనె : ఒకటిన్నర స్పూన్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు స్పూన్లు
వెనిగర్ : ఒక స్పూన్
నీరు : అర కప్పు
తేనె : అరకప్పు

ముందుగా చికెన్ ముక్కలు, బటర్, కార్న్ ఫ్లోర్, సోడా, తెల్లసొన వీటినన్నింటిని ఒక పాత్రలోకి తీసుకుని బాగా కలిపి అరగంట పాటు పక్కన బెట్టాలి. అరగంట తర్వాత చికెన్ ముక్కల్ని దోరగా వేపుకోవాలి.

మరో బాణలిలో నూనె వేడయ్యాక అల్లం వెల్లుల్లిని వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత తేనె, వెనిగర్, నీరు, జారుగా నీటితో కలిపిన కార్న్‌ఫ్లోర్ మిక్స్‌ను చేర్చి.. కాసేపు సన్నని సెగపై ఉంచి దించేయాలి. ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ ముక్కల్ని వేసి ఐదు నిమిషాల తర్వాత హాట్ హాట్‌గా సర్వ్ చేయండి. మీ పిల్లలు ఇష్టపడి తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

Show comments