Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీ గోల్డెన్ కలర్డ్ "వెజిటబుల్ ఆమ్లెట్"

Webdunia
కావలసిన పదార్థాలు :
గుడ్లు.. నాలుగు
బంగాళాదుంప.. ఒకటి
ఉల్లికాడలు.. ఒక కట్ట
టొమోటో.. ఒకటి
మిరపకాయ.. పెద్దది ఒకటి
ఉప్పు.. తగినంత
మిరియాలపొడి.. సరిపడా
నూనె లేదా వెన్న.. తగినంత

తయారీ విధానం :
గుడ్ల సొనను బాగా గిలకొట్టాలి. ఉల్లికాడ, మిరపకాయలను తరిగి ఉంచాలి. టొమోటోల్లో గింజలు లేకుండా తీసివేసి ముక్కలుగా తరగాలి. బంగాళాదుంప చెక్కు తీసి సన్నని పొడవు లేదా గుండ్రటి ముక్కలుగా తరిగి ఉంచాలి. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్‌లో నూనె లేదా వెన్న వేసి వేడయ్యాక కూరగాయ ముక్కల్ని వేసి దోరగా వేయించాలి.

ముక్కలు వేగిన తరువాత వాటిమీద ఉప్పు, మిరియాలపొడి వేసి కలియబెట్టాలి. ఆపై గుడ్డు సొనను పోసి ముక్కలన్నింటిమీదా పరచుకునేలా చూడాలి. కాసేపు ఉడికిన తరువాత ఆమ్లెట్ చెదిరిపోకుండా మెల్లిగా రెండోవైపుకు తిప్పి బంగారువర్ణం వచ్చేదాకా కాల్చాలి. అంతే ఘుమఘమలాడే వెజిటబుల్ ఆమ్లెట్ సిద్ధమైనట్లే..!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments