Webdunia - Bharat's app for daily news and videos

Install App

లో ఫ్యాట్ లో కార్బ్ "జాక్‌‌ఫ్రూట్ మసాలా బాల్స్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఉడికించి నలిపి ఉంచుకున్న పనస (జాక్‌ఫ్రూట్) ముక్కలు.. అర కప్పు
ఉడికించి నలిపి ఉంచిన బంగాళాదుంప ముక్కలు.. అర కప్పు
బరకగా నూరిన వేరుశెనగ గింజల పొడి.. 1 టీ.
ఉల్లిపాయ తరుగు.. అరర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్.. ఒక టీ.
స్కిమ్‌డ్ మిల్క్.. అర కప్పు
పసుపుపొడి.. ఒక టీ.
బ్లాక్ పెప్పర్ పొడి.. ఒక టీ.
జీలకర్ర పొడి.. ఒక టీ.
ధనియాలపొడి.. ఒక టీ.
కొత్తిమీర తరుగు.. ఒక టీ.
నూనె.. ఒక టీ.
పచ్చిమిర్చి తరుగు.. ఒకటి
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
ఒక నాన్‌స్టిక్ పెనం తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. అందులో బ్లాక్ పెప్పర్, ధనియాలపొడి, జీలకర్ర పొడులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగులను వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి. ఇందులోనే వేరుశెనగ గింజల పొడి, పసుపుపొడి, తగినంత ఉప్పువేసి బాగా కలిపి వేయించాలి. తరువాత దానికి పనస, బంగాళాదుంపల మిశ్రమాలను చేర్చి బాగా కలిపి వేయించాలి.

చివరగా స్కిమ్‌డ్ మిల్క్ చేర్చి బాగా కలిపి అవి ఇగిరేంతదాకా సన్నటి మంటపై ఉడికించాలి. మిశ్రమం అంతా దగ్గర పడ్డాక కొత్తిమీర తరుగును వేసి బాగా కలిపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కిందికి దించి చల్లారిన తరువాత ఉండలుగా చుట్టి, టొమోటో చట్నీ లేదా జామ్‌తో కలిసి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన జాక్‌ఫ్రూట్ పొటాటో బాల్స్ రెడీ. తక్కువ నూనెతో తయారయ్యే ఇవి తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. ముఖ్యంగా డైటింగ్ చేసేవారికి ఇవి బాగా తోడ్పడతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

Show comments