Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాక్.. మ్యాక్.. "మెకరొని మసాలా"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మెకరొని... ఒక కప్పు
ఉల్లిపాయలు... మూడు
నూనె... 3 టీ.
టొమోటో గుజ్జు... అర కప్పు
కారం... ఒక టీ.
పసుపు... పావు టీ.
అల్లంవెల్లుల్లి ముద్ద... అర టీ.
జీడిపప్పు... పది
గసాలు... రెండు టీ.
పెరుగు... అర కప్పు
కసూరి మెంతిపొడి... అర టీ.
ఉప్పు... తగినంత
గరంమసాలా... అర టీ.

తయారీ విధానం :
మెకరొనిని వేడినీటిలో వేసి ఉడికించి నీటిని వంపేయాలి. అందులో కొద్దిగా నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి. ఉల్లిపాయను తరిగి ముద్దలా చేయాలి. గసాలు, జీడిపప్పులను కూడా ముద్దగా నూరుకోవాలి. ఇప్పుడు ఓ బాణలిలో ఉల్లిముద్దను వేసి బాగా వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం వేయాలి.

టొమోటో గుజ్జును కొద్దిగా వేస్తూ వేయించాలి. ఆపై పెరుగు, జీడిపప్పు ముద్దను వేసి బాగా ఉడికించాలి. అవసరమైతే కాసిన్ని నీళ్ళు కూడా పోసి ఉడికించాలి. తరువాత అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న మెకరొనీని వేసి ఐదు నిమిషాలపాటు వేయించి చివర్లో మెంతిపొడి, గరంమసాలా పొడి చల్లి కలిపి దించేయాలి. దీన్ని వేడి వేడి చపాతీలతో కలిపి తింటే సూపర్బ్‌గా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించిన ర్యాపిడో బైక్ రైడర్

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

Show comments