Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ముర్గ్ ఓర్ సబ్జ్ సీఖ్" విత్ చికెన్ బ్రెస్ట్స్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
చికెన్ బ్రెస్ట్ ముక్కలు... నాలుగు
నిమ్మరసం... రెండు టీ.
ఉప్పు... తగినంత
పెరుగు.. ఒక కప్పు
నూనె... పావు కప్పు
వెలుల్లి.. నాలుగు రెబ్బలు
అల్లం... చిన్న ముక్క
జీలకర్ర.. ఒక టీ.
కారం... పావు టీ.
గరంమసాలా... అర టీ.
బంగాళాదుంప.. ఒకటి
బటన్ మష్రూమ్... వంద గ్రా.
పనీర్... వంద గ్రా.
రెడ్ క్యాప్సికమ్... వంద గ్రా.
ఆకుపచ్చ క్యాప్సికమ్.. వంద గ్రా.

తయారీ విధానం :
చికెన్ ముక్కల తోలుతీసి, అంగుళం సైజులో కత్తిరించాలి. క్యాప్సి‌కమ్‌లను కూడా చదరపు ముక్కలుగా కోయాలి. చికెన్, క్యాప్సికమ్‌ ముక్కలపైన నిమ్మరసం, ఉప్పు చల్లి అరగంటపాటు నానబెట్టాలి. పెరుగులో సగం నూనె పోసి కలపాలి. అల్లం, వెల్లుల్లి తురుము, జీలకర్రపొడి, గరంమసాలాలను కూడా అందులో కలపాలి.

ఈ మొత్తం మిశ్రమాన్ని చికెన్, క్యాప్సికమ్ ముక్కలకు పట్టించి ఓ రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి నానబెట్టాలి. ఇప్పుడు చికెన్, క్యాప్సికమ్ ముక్కలను ఒకదాని తరువాత ఒకటిగా ఓ పుల్లకు గుచ్చి.. మైక్రోవేవ్ ఓవెన్‌‌లో పెట్టి 500 డిగ్రీల వేడివద్ద 15 నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత వాటిని ఓసారి బయటికి తీసి నూనె పూసి రెండో వైపునకు తిప్పి మళ్లీ మరో 15 నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. అంతే వేడి వేడి ముర్గ్ ఔర్ సబ్జ్ సీఖ్ తయార్..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు : అలా వచ్చారు.. ఇలా వెళ్ళారు.. వైకాపా సభ్యుల తీరు మారదా?

నేనుండగా ఆ మహిళతో అక్రమ సంబంధమా? ప్రశ్నించిన భార్య.. చంపేసిన భర్త!

నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. సభకు రానున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్

వ్యభిచార గృహం మంచం కింద అడ్డంగా దొరికిన వైకాపా నేత శంకర్ నాయక్!! (Video)

ఇద్దరికి పెళ్లీడు వచ్చాక చూద్దామన్న తండ్రి.. కత్తితో పొడిచిన ప్రియుడు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Local Boy Nani: బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్.. నాని అరెస్ట్

Lakshmi Manchu: అందాల రహస్యాలపై శ్రీదేవి గురించి లక్ష్మి మంచు చెప్పిన సీక్రెట్

అనగనగా ఉపాధ్యాయుడిగా సుమంత్‌

దిల్ రాజు ఆవిష్కరించిన బరాబర్ ప్రేమిస్తా నుంచి రెడ్డి మామ.. సాంగ్

మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లోనా? చేసే చేతల్లో నా? చెప్పేదే సారంగపాణి జాతకం

Show comments