Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బటర్ నూడిల్స్" విత్ టొమోటో సూప్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఉడికించిన పెద్ద టొమోటోలు... మూడు
వెన్న... ఒక టీస్పూన్
నీరు... సరిపడా
పచ్చిమిరపకాయ ముక్కలు... కాసిన్ని
పంచదార... ఒకటిన్నర టీస్పూన్లు
చిదిమిన నూడిల్స్... నాలుగు టీస్పూన్లు
ఉల్లికాడల ముక్కలు... రెండు టీస్పూన్లు
ఉప్పు... సరిపడా
మొక్కజొన్న పిండి... ఒక టీస్పూన్
అల్లం పేస్ట్... పావు టీస్పూన్

తయారీ విధానం :
టొమోటోల పై చర్మం తీసేసి పచ్చిమిరపకాయలను కలిపి మెత్తగా మెదపాలి. మూకుడులో వెన్న వేసి వేడిచేసి అందులో టొమోటో గుజ్జు కలిపి నూనె వేరుపడేంతదాకా ఉడికించాలి. ఆ తరువాత పంచదార, తరిగిన ఉల్లికాడలు, అల్లం పేస్టు, నూడిల్స్, నీరు కలపాలి.

నూడిల్స్ మెత్తబడిన తరువాత మొక్కజొన్న పిండి పేస్ట్, ఉప్పు పై మిశ్రమానికి కలపాలి. దీనిని ఆపకుండా కలియబెడుతూ కొద్దిసేపు మంట తగ్గించి ఉంచాలి. ఆ తరువాత మిరియాలతో అలంకరించి కొద్దిగా వెన్నవేసి వేడివేడిగా అతిథులకు అందించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

నిశ్చితార్థంలో చెంపదెబ్బ.. అయినా రూ.12లక్షలతో పెళ్లి ఏర్పాటు.. ఎన్నారై వరుడి మాయం!

కొట్టుకుందాం రా: జుట్టుజుట్టూ పట్టుకుని కోర్టు ముందు పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తాకోడళ్లు (video)

55మంది వైద్యులను తొలగించిన ఏపీ సర్కారు.. కారణం అదే?

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

Show comments