Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీపి తీపి టొమాటో "క్రీమ్‌ అప్‌ సూప్‌"

Webdunia
కావలసిన పదార్థాలు :
ఎర్రగా పండిన టొమోటోలు.. అర కేజీ
క్యారెట్.. పావు కేజీ
ఉల్లిపాయలు.. వంద గ్రా.
పలావు ఆకులు.. 3
మిరియాలు.. రెండుటీ.
వెల్లుల్లి.. 4 రెబ్బలు
వెన్న లేదా డాల్డా.. 50 గ్రా.
బ్రెడ్ ముక్కలు.. ఒక కప్పు
మైదా పిండి.. 50 గ్రా.
పాలు.. అర లీ.
మంచినీరు.. ఒక లీ.
పంచదార.. అర టీ.
ఉప్పు.. తగినంత

తయారుచేసే విధానం
బ్రెడ్‌ ముక్కల్ని వేయించి ఉంచాలి. ఓ గిన్నెలో నీళ్లు పోసి తరిగిన టొమాటోలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌ తురుము వేసి ఉడికించాలి. ముక్కలు కాస్త ఉడికాక.. పలావు ఆకులు, మిరియాలు, వెల్లుల్లి కలిపి 10 నిమిషాలు ఉడికించి దించాలి. ఇందులోని నీటిని విడిగా ఓ గిన్నెలోకి వడగట్టి ఉంచాలి. దీన్నే సూప్‌ ప్యూరీ అంటారు.

కూరగాయ ముక్కల్ని చల్లారనిచ్చి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. మరో మందపాటి బాణలిలో డాల్డా లేదా వెన్న వేసి కరిగిన తరువాత మైదా పిండి వేసి దోరగా వేయించాలి. ఇందులో పాలు పోస్తే వైట్‌ సాస్‌లా తయారవుతుంది. ఇప్పుడు సూప్‌ ప్యూరీలో వైట్‌సాస్‌, కూరగాయ ముక్కల పేస్టు వేసి, బాగా కలపాలి. చిక్కగా అయ్యేవరకూ మరిగించి, ఉప్పు సరిచూసి దించాలి. బ్రెడ్‌ ముక్కల్ని కూడా కలిపి కాస్త మీగడను సూప్‌మీద అలంకరిస్తే క్రీమ్‌ అప్‌ సూప్ రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై సజ్జనార్ సీరియస్.. నానికి కితాబ్.. మారకపోతే అంతే సంగతులు

పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

Show comments