Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలీవ్ సువాసనలతో "ఆలీవ్ విత్ చికెన్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఆలీవ్ నూనె.. వంద గ్రా.
చికెన్ ముక్కలు.. ఒకటిన్నర కిలో
అల్లంముద్ద.. ఒక టీ.
జీలకర్ర.. అర టీ.
నిమ్మకాయ ముక్కలు... రెండు
వెల్లుల్లిపాయ.. ఒకటి
కారం.. ఒక టీ.
మైదాపిండి.. ఒక టీ.
మంచినీరు.. ఒక గ్లాసు
ఉడికించిన ఆకుపచ్చని ఆలీవ్ గింజలు.. 300 గ్రా.
నిమ్మరసం.. ఒక టీ.
కొత్తిమీర.. ఒక కట్ట
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
ఒక గిన్నెలో నూనె పోసి చికెన్ ముక్కలు వేసి వేయించాలి. కాస్తంత వేగాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముద్ద, జీలకర్ర, కారం వేసి బాగా కలియబెట్టాలి. అందులో ఒక కప్పు మంచినీళ్లు పోసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత మైదా పిండిని ఒక కప్పు నీటిలో కలిపి ఉడుకుతున్న మిశ్రమంలో వేసి 45 నిమిషాలపాటు ఉడికించాలి.

తరువాత ఉడికించి పెట్టుకున్న ఆలీవ్ గింజల్ని కూడా వేసి మరో పదినిమిషాలపాటు సన్నని మంటపై ఉడికించాలి. చివర్లో నిమ్మరసం, కొత్తిమీర వేసి దించేయాలి. అంతే ఆలీవ్ ఘుమఘుమలతో తయారైన టేస్టీ రెసిపీ ఆలీవ్ విత్ చికెన్ రెడీ...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

Show comments