Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపండుతో రుచుల పసందు "ఐస్‌క్రీమ్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పాలు.. ఒక లీటర్
ఐస్‌క్రీం పౌడర్.. 60 గ్రాములు
క్రీం... 500 మి.లీ.
పంచదార.. 200 గ్రా.
అరటిపండ్లు.. ఆరు

తయారీ విధానం :
ముందుగా పాలను వేడి చేసుకోవాలి. చిన్న కప్పులో కాసిన్ని పాలు తీసుకుని ఐస్‌క్రీం పౌడర్‌ను ఉండలు కట్టకుండా కలిపి పాలలో పోయాలి. దాంతోపాటు పంచదారను, క్రీంను కూడా ఉడుకుతున్న పాలల్లో వేసి కాసేపు వేడిచేయాలి. ఈ మిశ్రమం కాస్త చిక్కబడి చల్లారిన తరువాత ఐస్ ట్రేలోకి మార్చి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి.

అలా ఐస్‌ ట్రేలలో పెట్టిన మిశ్రమం ఐస్‌క్యూబులా గట్టిగా మారుతుంది. తరువాత ఈ క్యూబును తీసి నీళ్లు పోయకుండా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని ట్రేలో పెట్టి నాలుగ్గంటలపాటు డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి. మళ్లీ దాన్ని తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బితే చల్ల చల్లగా నురగలు గక్కుతుండే బనానా ఐస్‌క్రీం సిద్ధమైనట్లే. ఇది అచ్చం మార్కెట్లో దొరికేదిలాగే ఉంటుంది. రుచికి రుచి, పోషకాలు అపారంగా ఉండే ఈ ఐస్‌క్రీంను పిల్లలు, పెద్దలు ఇష్టంగా లాగించేస్తారు. మీరూ ఓసారి ట్రై చేయండి మరి..!!

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

Show comments