Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్‌ నూడుల్స్ చాప్స్

Webdunia
కావలసిన పదార్థాలు :
అమెరికన్ నూడుల్స్... అర కేజీ
క్యాబేజీ... 200 గ్రా.
క్యారెట్... 200 గ్రా.
బీన్స్... వంద గ్రా.
ఉల్లిపాయలు... నాలుగు
వెల్లుల్లి... ఎనిమిది రెబ్బలు
అల్లం... చిన్న ముక్క
చిల్లీసాస్... మూడు టీ.
అజినమోటో... అర టీ.
ఉప్పు... తగినంత
కార్న్‌ఫ్లోర్... 50 గ్రా.
నూనె... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
నూడుల్స్‌ను మరిగించిన నీళ్లలో వేసి ఉడికించాలి. తరవాత వాటిని దించి చిల్లుల ప్లేటులో వేయాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి, నీళ్లు వార్చిన నూడుల్స్‌ను వేసి వేయించాలి. విడిగా ఓ పాన్‌లో సన్నగా తరిగిన అల్లంవెల్లుల్లి ముక్కల్ని వేసి సన్నగా పొడవుగా తరిగిన కూరగాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా వేయించి, గ్లాసు నీరు పోసి ఉడికించాలి.

ఆ తరువాత అందులో తగినంత ఉప్పు, చిల్లీసాస్‌, అజినమోటో వేసి కలిపి దించాలి. కార్న్‌ఫ్లోర్‌ను కాసిన్ని నీళ్లలో కలిపి చిల్లీసాస్‌లో పోస్తే చిక్కగా తయారవుతుంది. దీన్ని నూడుల్స్‌ మీద పోసి వేడిగా వడ్డించాలి. అంతే అమెరికన్ నూడుల్స్ చాప్స్ సిద్ధం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments