Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్లో ఆత్మన్యూనతకు కారణాలేంటి?

Webdunia
సోమవారం, 15 డిశెంబరు 2014 (17:18 IST)
నలుగురితో కలిసే చిన్నారులతో పోల్చిచూస్తే ఒంటరిగా ఉండే పిల్లల్లో ఆత్మన్యూనత, అభద్రతా భావం ఎక్కువగా ఉంటాయట. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే.. స్కూలుకెళ్లే పిల్లలతో వాళ్ల తరగతి గది విశేషాలను అడిగి తెలుసుకోండి. స్నేహితుల వివరాలూ రాబట్టండి. అలాంటప్పుడు నాకెవ్వరూ స్నేహితులు లేరు.. నేనొక్కడినే ఆడుకుంటా అంటుంటే దానికి కారణం తెలుసుకోండి. 
 
తోటి చిన్నారులు మీ బాబులోని లోపాన్ని ఎత్తిచూపుతున్నప్పుడు అలాంటి వారికి దూరంగా, ఒంటరిగా ఉండాలనుకుంటారు. అదే కారణమైతే మీ చిన్నారిలో ఆత్మవిశ్వాసం నింపండి. తనలో ఉన్న ప్రతిభను బయటపెడితే అందరూ తనతో స్నేహంగా ఉంటారనే విషయం తెలియచేయండి. ఏదైనా లోపం ఉంటే అది చిన్నదేనని సర్దిచెప్పండి. 
 
మా పాపని వాళ్లనాన్న ఒక్క క్షణమూ వదిలి ఉండలేరు. అందుకే ఎక్కడికీ పంపం అంటుంటారు. కొందరు తల్లులు. అయితే ఈ  తీరుతో పిల్లల్లో ప్రతికూల ఆలోచనలను పెంచుతున్నామని ఎప్పుడైనా, ఆలోచించారా? అమ్మానాన్నల తోడు లేకుండా ఎక్కడికీ వెళ్లలేకపోవడం, చిన్న ఇబ్బందికే బెంబేలెత్తిపోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటప్పుడు రోజూ మీ స్నేహితురాలి ఇంటికో లేక దగ్గర్రో ఉన్న పార్కుకో తీసుకెళ్లండి. అక్కడి ఉన్న పిల్లలతో పాటు ఆడుకునేలా ప్రోత్సహించండి. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments