జలుబు, దగ్గు నుంచి పిల్లలకు ఉపశమనం లభించాలంటే?

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (16:52 IST)
వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ బాగా వేధించే సమస్యలు జలుబు, దగ్గు. ఈ సమస్యల నుంచి పెద్దలు, పిన్నలు ఉపశమనం పొందాలంటే.. హోం మేడ్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. 
 
జలుబు, దగ్గు తగ్గాలంటే.. నీటిలో కొద్ది పరిమాణంలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. ఆ ఆవిరిని చిన్నారికి పట్టిస్తే దగ్గు చాలావరకు తగ్గిపోతుంది. 
 
పసుపు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. వైరల్ ఇన్ ఫెక్షన్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తుంది. వేడి పాలలో కొంచెం పసుపు వేసి జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు తాగిస్తే ఎంతో రిలీఫ్‌గా ఫీలవుతారు. 
 
జలుబు చేసినప్పుడు గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే.. గ్లాసు వేడి నీటిలో టీస్పూను ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత పుక్కిట పట్టాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే సరి. 
 
వేడి నీటి ఆవిరి పట్టినా ఉపశమనం కలుగుతుంది. 10-15 నిమిషాల పాటు ఇలా ఆవిరి పట్టాలి. ఆ నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపితే మరీ మంచిది. శ్వాస సాఫీగా సాగేందుకు ఇది ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. 
 
రోజులో రెండు మూడు సార్లు తేనెను వారితో కొద్దికొద్దిగా నాకిస్తే వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. ఐదేళ్ళ వయసు పైబడిన పిల్లలకు తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి తినిపిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లల ఛాతీపై ఆవనూనెకు వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మెల్లగా మసాజ్ చేయాలి. 
 
శరీరానికి మంచినీరు ఎంతో అవసరం. పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. అప్పుడు శరీరం వ్యాధితో సమర్థంగా పోరాడగలదు. కోల్పోయిన నీటి శాతం వెంటనే భర్తీ అవుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి : జగన్ వెన్నులో వణుకు .. మంత్రి పయ్యావుల

దీపక్ ఆత్మహత్య: వ్యూస్ కోసం కావాలనే అలా చేసిందా? మహిళ షిమ్జితా అరెస్ట్

తమిళ నటుడు విజయ్ టీవీకే పార్టీ గుర్తు విజిల్, ఖుషీలో ఫ్యాన్స్

ఆ జీతాలపై ఆధారపడటానికి వైకాపా ఎమ్మెల్యేలు అంత పేదవాళ్లు కాదు

సోషల్ మీడియాకు 16 ఏళ్లలోపు పిల్లలను దూరంగా వుంచనున్న ఏపీ సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrhaas: కాలేజీ స్టూడెంట్స్ నడుమ బరాబర్ ప్రేమిస్తా డేట్ పోస్టర్ రిలీజ్

Happy Raj: విజయ్ దేవరకొండ చేతుల మీదుగా హ్యాపీ రాజ్ ప్రోమో

Purushah: ఆ కిటికీ వద్ద ఏం జరుగుతోంది అంటోన్న వెన్నెల కిషోర్

Vishal: హైప్ క్రియేట్ చేస్తోన్న విశాల్, తమన్నా కాంబినేషన్ లో మొగుడు గ్లింప్స్

తదుపరి చిత్రం పవన్ కళ్యాణ్‌తోనా : అనిల్ రావిపూడి ఏమన్నారు?

Show comments