పిల్లలకు స్కూళ్ళు మొదలయ్యాయ్.. చిరుజల్లులు జాగ్రత్త!

Webdunia
శనివారం, 13 జూన్ 2015 (17:16 IST)
పిల్లలకు మళ్లీ స్కూళ్ళు మొదలయ్యాయి. మరోవైపు చిరుజల్లులు. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోవాలి. తేమ తక్కువగా ఉండే ఈ వాతావరణంలో పిల్లలకు ర్యాషెస్ వస్తుంటాయి. ముఖ్యంగా కాలివేళ్ళు, పాదాలకు ఈ వాతావరణంలో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. స్కూల్‌కు సాక్స్, షూస్ ధరించి వెళ్ళి ఎక్కువసేపు ఉండాల్సిరావడం వల్ల కాలి వేళ్ళ నడుమ తడి, చెమట చేరి ఫంగస్ సులువుగా పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రదేశాన్ని పొడిగా ఉంచుకోవాలి. 
 
యాంటీ ఫంగల్ పౌడర్‌ను అద్దుకుని స్నాక్స్, షూ వేసుకోవాలి. తప్పనిసరిగా  పిల్లలు రెండుపూటలు స్నానం చేయాలి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేశాక లేత రంగుల, వదులుగా వుండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు, ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా లభించే నిమ్మజాతి పానీయాలు తాగుతుంటే రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. 
 
రోలాన్‌లు, డియోడరెంట్‌లు వాడనీయకూడదు. వీటివల్ల చర్మ రంధ్రాలు మూసుకొని పోయి బాయిల్స్ వంటి ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. దోమలు, ఈగలు వంటి వాటిని దగ్గరకు రానీయకూడదు. 
 
స్కూలు నుంచి రాగానే షూ విప్పేసి కాళ్ళు శుభ్రంగా కడుక్కునే అలవాటు చేయించాలి. యాంటీ సెప్టెక్ సొల్యూషన్‌లో పాదాలు ముంచితే బ్యాక్టీరియా నశిస్తుంది. స్నాక్స్‌ను వేడి నీళ్ళతో వాష్ చేస్తుండాలి. ఈ సీజన్‌లో ఎంత పరిశుభ్రత పాటిస్తుంటే అంత ఆరోగ్యంగా ఉంటారని పిల్లలకు వివరిస్తూ వుండాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్దపల్లి జిల్లాలో దారుణం.. మూడేళ్ల బాలికను పీక్కుతున్న వీధి కుక్కలు

మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు.. మీ వయసెంత? మహిళకు క్యాబ్ డ్రైవర్ వేధింపులు

ఇండోర్ సిటీలో దారుణం, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే యువతిని కొడుతూ ఈడ్చుకెళ్లాడు, వీడియో

నేను గర్భవతినయ్యా, ట్రాన్స్‌జెండర్ తమన్నా షాకింగ్ పోస్ట్, ఫోటోలు

హైదారాబాద్ నుంచి బెంగళూరుకి విమానం, గాల్లోనే 4 గంటలు గిరికీలు, ప్రయాణికులు హాహాకారాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన విజయ్ దేవరకొండ మూవీ

Raghu Kunche: గేదెల రాజు క్యారెక్టర్ భయపెట్టేలా ఉండేందుకు 12 కేజీల పెరిగాను : రఘు కుంచె

Vijay Sethupathi: పూరి జగన్నాథ్- స్లమ్ డాగ్ స్పెషల్ ఫిల్మ్ గా గుర్తుండిపోతుంది : విజయ్ సేతుపతి

Chiranjevi: గొప్ప మనసు చాటిన మెగాస్టార్ చిరంజీవి 20 లక్షల వైద్య సహాయం

Poonam Kaur : భీమేశ్వర ఆలయంలో పూనమ్ కౌర్ పూజలు

Show comments