Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రంతా నిద్ర మేలుకుని మరీ చదవటం అవసరమా..?

Webdunia
FILE
* రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు రాత్రంతా మేలుకుని లైన్ టు లైన్ రివిజన్ చేయకూడదు. అయితే ముఖ్యమైన పాయింట్స్‌ను ఒకసారి మననం చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్స్ సమయంలో రాత్రంతా మేలుకుని చదివితేనే మార్కులు బాగా వస్తాయని అనుకోవటం సరికాదు. రాత్రి చదవకపోయినా బాగానే రాయగలమని విశ్వాసం పెంచుకోవాలి.

* ఏదైనా చాప్టర్ చదవటం పూర్తి కాకపోయినా.. జనరల్ నాలెడ్జ్ ఉపయోగించి సమాచారాన్ని సంక్షిప్తంగానైనా రాయగలను అనే ధైర్యాన్ని పెంచుకోవాలి. ఒక సమాధానాన్ని పదిసార్లు రివైండ్ చేస్తేనే గుర్తుంటుందని అనుకోకూడదు. రెండుసార్లు చదివినా మైండ్‌లో స్థిరపడేవిధంగా చదివితే సరిపోతుంది.

* రాత్రి పది-పదకొండు గంటలు దాటకముందే పడుకోవాలి. ఉదయం ఒక గంటసేపు మాత్రం ముఖ్యమైన పాయింట్లను చదువుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా పిల్లలు నిద్రను ఎంతగా ఆపుకుంటే, పరీక్షల సమయంలో భయం అంతగా రెట్టింపు చేస్తుందని గుర్తుంచుకోవాలి. అంతేగాకుండా రాత్రిళ్లు ఎక్కువ సమయం మేల్కొని చదివితే, అది గుర్తుండకపోగా, అంతకు ముందు చదివిన చాఫ్టర్స్‌ని కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. నిద్రపోకుండా రాత్రంతా చదువుతూ ఉంటే మానసిక, శారీరక ఆరోగ్యాలపై చెడు ప్రభావం చూపిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments