Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లవానికి స్నానం ఎలా చేయించాలి..?

Webdunia
పిల్లవానికి స్నానం చేయించేముందు కావలసిన వస్తువులను ముందుగా సిద్ధం చేసుకోవాలి. బాత్ టబ్, బేబీ సోప్, మృదువైన తువ్వాలు, కాస్త దూది, పరిశుభ్రమైన న్యాపీ, నీళ్ళు సిద్ధంగా ఉంచుకోవాలి. నీళ్ళు తగినంత వేడిగా ఉంటే చాలు.

** తొలుత పిల్లవాని బట్టలు తీసేయండి. కాని న్యాపీ అలాగే ఉంచండి. దానిని తువాలులో చుట్టిపెట్టండి. దూదితో పిల్లవాని కళ్ళు, చెవులు, నోరు మరియు మెడ భాగాన్ని శుభ్రం చేయండి.

** పిల్లవాని తలను బాత్‌టబ్‌పై ఉంచండి. అతని వీపును, మెడను ఒక చేత్తో పట్టుకోండి, మరో చేత్తో అతని తలను నీటితో కడగండి ఆ తర్వాత తువాలుతో తుడవండి.

** మీరు ఏ తువాలుతో అతనిని చుట్టపెట్టివున్నారో దానిని ఊడదీయండి. న్యాపీకూడా విప్పేయండి. అతని చేతులు-కాళ్ళకు మృదువుగా కాసింత బేబీ సబ్బును రుద్దండి.

** సబ్బును రుద్దడంతో పాపాయి శరీరం జారుతుంటుంది. కాబట్టి అతని భుజాలను గట్టిగా పట్టుకోండి. అలాగే రెండో చేత్తో అతని వీపు భాగానికి కాస్త సపోర్ట్‌గా చేతిని అడ్డుపెట్టండి. తర్వాత మెల్లగా నీటిలో కూర్చోబెట్టండి.

** పిల్లవానిపై నీటిని చిలకరించి పూర్తి శరీరాన్ని కడిగివేయండి. ఆ తర్వాత పిల్లవాడ్ని బాత్‌టబ్‌నుంచి బయటకు తీసివేయండి. అతనిని ఓ తువ్వాలులో చుట్టేయండి. మరో తువ్వాలుతో శరీరాన్ని తుడవండి. ముఖ్యంగా కాళ్ళు, చేతులపై దృష్టిని సారించండి. చివరిగా బేబీక్రీమును శరీరానికి పూయండి. చివరిగా నేపీ మరియు బట్టలను తొడగండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

Show comments