Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలపై శ్రద్ధ తీసుకోండి

వర్కింగ్ ప్యారెంట్స్ కష్టాలు

Gulzar Ghouse
పిల్లలు మరీ చిన్నవారైనప్పుడు వారు ప్రతి చిన్న వస్తువు, పనికోసం తల్లిదండ్రులపైనే ఆధారపడుతుంటారు. ఇంటివద్దే ఉండే తల్లులకైతే వారికి కావలసినవి చేసిపెడుతుంటారు. వారి బాగోగులు చూసుకుంటుంటారు.

కాని తల్లిదండ్రులిరువురుకూడా తమతమ పనులపై బయటకు వెళ్ళేవారు నేడు అధికంగా ఉన్నారు. అలాంటి వారు పిల్లలను సరిగా చూసుకోలేరు. మనసు ఒక చోట తనువు ఒక చోట అన్న చందాన వారు సతమతమవుతుంటారు. ఎందుకంటే సమయానికి పిల్లలకు కావలసిన ఆహారం, చదువు ఇతరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించలేరు.

దీనికోసం వర్కంగ్ ప్యారెంట్స్‌కు కొన్ని చిట్కాలు, ఇవి పిల్లలను పెంచేవిషయంలో చాలావరకు తొడ్పాటునిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

** ఒక వేళ మీరు ప్రతిరోజూ ఉదయమే కార్యాలయానికి వెళ్ళేవారైతే ఉదయమే పిల్లలకు కావలసిన భోజనం సలాడ్ లాంటివి తయారు చేసి ఉంచండి. దీంతో పిల్లలు సమయానుసారం భోజనం చేయగలరు.

** ముఖ్యంగా పిల్లలకు భోజనంలో పౌష్టికాహారం లభిస్తోందా లేదా అనే విషయాన్ని మీరు కాస్త శ్రద్ధగా గమనించాలి.

** పిల్లలకు ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట డిన్నర్‌‌ల సమయ పట్టికను(టైమ్ టేబుల్) రూపొందించి ఉంచండి.

** పిల్లలకు ఖాళీ సమయం ఉన్నప్పుడు వారికి మీరు లేని సమయంలో ట్యూషన్ ను ఏర్పాటు చేయండి. దీంతో మీరు వారి చదువుపై కూడా కాస్త శ్రద్ధ తీసుకున్నవారువుతారు.

** అలాగే వారు ఆడుకోవడానికి కూడా సమయాన్ని నిర్ణయించండి. క్రమం తప్పకుండా నెలకోసారి వారి పాఠశాలకు వెళ్ళి(స్కూల్) వారి అధ్యాపకులను కలిసి మీ పిల్లల ప్రోగ్రెస్ గురించి అడిగి తెలుసుకుంటుండండి.

** మీరు మీ కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకు కాస్త సమయం ఇవ్వండి. ఆ తర్వాత వారి చదువుగురించి వివరాలను అడిగి తెలుసుకోండి.

**ప్రతిరోజూ మీ పిల్లలతో ఫోన్‌లోకూడా సంప్రదిస్తూ ఉండండి. దీంతో మీరు వారిపై శ్రద్ధ చూపించినట్టుంటుందంటున్నారు విశ్లేషకులు. అలాగే మీరు వారి దగ్గర లేరన్న లోటు వారికి కలగదంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

Show comments