Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాప ఏడ్చింది...!

మన్నవ గంగాధర ప్రసాద్
ఇంట్లో పిల్లలు ఆనందంగా నవ్వుతుంటే ఇంటిల్లిపాది తన్మయత్వంతో ఉప్పొంగిపోతుంటారు. అదే పిల్లలు ఏడ్వడం మొదలు పెడితే...అందరూ తల్లడిల్లిపోతారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ఏడిస్తే తట్టుకోలేరు.

ప్రతి పిల్లవాని స్వభావం వేరువేరుగావుంటుంది. కొంతమంది పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు. కొంతమంది పిల్లలు పగలుపూట బాగా ఆటలాడుకుంటుంటారు. అదే రాత్రి అయ్యిందంటే ఏడ్వడం ప్రారంభిస్తారు. ఈ విధంగా పిల్లలు ఆహారం తీసుకోవడంలోనూ, ఆటలాడడంలోనూ వారికిష్టమైన రీతిలో తమ అలవాట్లను మనకు ఆపాదిస్తుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి అలవాట్లను గమనిస్తూవుండాలి. వారిని గమనిస్తూవుంటే పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థమౌతుందంటున్నారు పరిశోధకులు.

పిల్లలు ఏడ్వడానికిగల కారణాలు :-

** పిల్లల్లో శారీరక బాధలేవైనా ఏర్పడినప్పుడు వారు తరచూ ఏడుస్తుంటారు.

** వారికి నిద్ర సరిపోకపోతే కూడా ఏడ్వడం మొదలుపెడతారు.

** ఆకలి వేసినప్పుడుకూడా వారు అధికంగా ఏడుస్తుంటారు.

** బహుశా ఏదైనా పురుగు కుట్టినాకూడా వారు ఏడుస్తారు.

** కడుపులో నొప్పి అధికమైనప్పుడుకూడా వారు ఏడ్వడం మొదలుపెడతారు.

పిల్లలు ఏడిస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు :-

** పిల్లవానికి ఆకలిగావుంటే వెంటనే పాలు తాగిపించండి.

** పిల్లలకు నిద్రవచ్చేటట్టయితే వారిని భుజంపై వేసుకుని అటూ-ఇటూ తిరగండి.

** పిల్లలు విపరీతంగా ఏడ్వడం మొదలుపెట్టినప్పుడు వారిని ఏదైనా పురుగు కుట్టిందేమో ఒకసారి వారి శరీరాన్ని గమనించండి.

** పిల్లలు ఆడుతూ...ఆడుతూ ఏదైనా నోట్లో వేసుకున్నాడేమో గమనించండి.

** విపరీతంగా ఏడ్వడం మొదలుపెడితే వెంటనే వైద్యుడ్ని సంప్రదించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

Show comments